మరో నెల రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు

Advertisements

&NewLine;<p>మరో నెల రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్థాన్‌ లో ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి&period; రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు గోవింద్‌ సింగ్‌ డోటాస్రా&comma; మహువా నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు&period; మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ కుమారుడు వైభవ్‌ కు ఈడీ సమన్లు జారీ చేసింది&period; ఫెమా నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన కేసులో వైభవ్‌కు ఈ సమన్లు అందినట్లు తెలిసింది&period; ఈ కేసులో వైభవ్‌ను ప్రశ్నించేందుకు అక్టోబరు 27à°¨ దర్యాప్తు సంస్థ ఎదుట హాజరుకావాలని ఈడీ పేర్కొన్నట్లు అధికారులు వెల్లడించారు&period;దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ఎక్స్ వేదికగా స్పందిస్తూ కేంద్రంపై ధ్వజమెత్తారు&period; అక్టోబరు 25à°¨&comma; రాజస్థాన్‌ మహిళల కోసం కాంగ్రెస్‌ హామీలు ప్రకటించింది&period; ఆ మరుసటి రోజు అక్టోబరు 26à°¨ రాజస్థాన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గోవింద్‌ సింగ్‌పై ఈడీ దాడులకు దిగింది&period; నా కుమారుడు వైభవ్‌కు సమన్లు జారీ చేసిందని గహ్లోత్‌ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.