65
బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధి లో ని గణేష్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఇంటి ముందు గోవులకు రొట్టెలు వేస్తుండగా, ఎదురుగా ఉన్న థామస్ అనే వ్యక్తి మా ఇంటి ముందు వేస్తావా? అని గొడవకు దిగి మహిళ అని చూడకుండా నోటికి ఇష్టం వచ్చినట్లు అసభ్య పదజాలం తో తిట్టడం తో అది గమనించిన ఆమె కుమారుడు విజయ్ మా అమ్మ ను తిడతావా అని అడిగే లోపే, లోపలికి వెళ్లి కత్తి తో బయటకు వచ్చి కడుపు కింద భాగంలో పొడిచేయడమే కాక, ఇది నా రోడ్, ఇక్కడ ఆవులకు మళ్ళీ ఒకసారి ఏదైనా పెడితే అందరిని చంపేస్తా అని బెదిరించి లోపలికి వెళ్లి పోయాడు. విషయం తెలుసుకున్న బోయిన్ పల్లి పోలీస్ లు థామస్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.