మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రిని తెలంగాణ రాష్ట్ర HMS అధ్యక్షుడు, యూనియన్ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి హక్కులను కాపాడడంలో HMS ఎప్పుడు ముందుంటుందని అన్నారు. యూనియన్ ఉద్యమాల ద్వారా ఈ దవాఖన నిర్మితమైనదని, కానీ ఇప్పుడు దావాఖనాలన్ని రాజకీయాల కబంధ హస్తాలలోకి వెళ్ళిపోయి నాశనం అయ్యాయన్నారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి కన్నా ఏరియా ఆసుపత్రి చాలా పెద్దదని, ఇటు వంటి ఆసుపత్రిని ఆధునీకరించి, సరిపడా వైద్యులను నియమించాలని తెలిపారు. ఎంతో కృషి చేసి గోదావరిఖని నుండి గైనకాలజిస్టు ను ఇక్కడ నియమించడం జరిగిందని, కానీ గైనకాలజిస్టు కు సరైన సదుపాయాలు కల్పించకపోవడంతో ఆపరేషన్లు చేయలేకపోతుందని, ఆసుపత్రిలో సరిపడా స్పెషలిస్ట్ డాక్టర్లు, నర్సులు, ఆయాలు, టెక్నిషియన్స్ లేరని, మందులు కూడా సరిగ్గా రావడం లేదని, ఈ ఆసుపత్రి కేవలం రెఫరల్ దవాఖాన గా మారిపోయిందని, ఆరోగ్య సమస్యలతో వచ్చిన కార్మికులను మంచిర్యాల, గోదావరిఖని, హైదరాబాద్ రెఫర్ చేస్తున్నారని, దీనికి ముగింపు పలుకుతూ ఇక్కడ సమస్యల్ని తీర్చాలని డిమాండ్ చేశారు. సింగరేణి డిక్లరేషన్ ప్రకటించిన తరువాతే ఏ రాజకీయ పార్టీ నాయకులైన కార్మికులను ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు.
Read Also..