117
ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండల పరిధిలో మైనర్ బాలికను నమ్మించి బలవంతంగా తాళి కట్టిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏ కొండూరు గ్రామపంచాయతీ శివారు జానలగడ్డ గ్రామంలో ఓ మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు బలవంతంగా వివాహం చేసుకున్నాడు. తాళి కట్టిన విషయం తండ్రికి తెలియటంతో తండ్రి బాలికను నిలదీయగా జరిగిన విషయాన్ని మైనర్ బాలిక తల్లిదండ్రులు చేప్పింది. ఈ విషయంపై బాలిక తల్లిదండ్రులు, ఏ కొండూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.ఈ ఘటన పై తిరువూరు సి.ఐ అబ్దుల్ నభి మాట్లాడుతూ తల్లిదండ్రుల పిర్యాదు మేరకు ఫోక్స కేసు నమోదు చేసి బాద్యునిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.