రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో డ్రగ్స్ కలకలం.

Advertisements

<p>రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని అజీజ్‌నగర్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి&period; బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న డ్రగ్స్ పార్టీపై పోలీసులు మెరుపు దాడి చేశారు&period; ఫామ్‌హౌస్‌లో మద్యం&comma; డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న పక్కా సమాచారంతో&period;&period;ఈగల్ టీమ్&comma; ఎస్‌‌వోటీ&comma; స్థానిక పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు&period; పోలీసుల రాకను గమనించిన నిందితులు&period;&period; ఒక రౌండ్ కాల్పులు జరిపారు&period; ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమీద్ శర్మ ఈ కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు&period; ఆ తుపాకీ రితేష్ రెడ్డికి చెందినదిగా ప్రాథమిక విచారణలో తేలింది&period;<&sol;p>&NewLine;<p>ఈ పార్టీలో మొత్తం 10 మంది పాల్గొన్నట్లు పోలీసులు ధ్రువీకరించారు&period; పట్టుబడిన వారిలో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితో పాటు ఏపీలోని ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ యాదవ్&comma; రియల్ ఎస్టేట్ వ్యాపారులు నమీద్ శర్మ&comma; రితేష్ రెడ్డి&comma; రమేశ్&comma; శ్రవణ్ కుమార్&comma; విజయ్ కృష్ణ&comma; కాసిక్ రవి&comma; అర్జున్ రెడ్డితో పాటు ఓ మహిళ ఉన్నారు&period; వీరంతా వీకెండ్ పార్టీ కోసం వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకున్నట్లు సమాచారం&period; పోలీసులు ఘటనా స్థలంలోనే డ్రగ్ టెస్ట్ కిట్‌లతో పరీక్షలు నిర్వహించగా&period;&period; రోహిత్ రెడ్డి&comma; నమీద్ మిశ్రా&comma; రితేష్ రెడ్డి&comma; కాసిక్ రవి&comma; అర్జున్ రెడ్డిలకు పాజిటివ్‌గా తేలింది&period; తామంతా వారం క్రితమే సిమ్లా&comma; గోవా పర్యటనల నుంచి వచ్చామని&comma; అక్కడే డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తోంది&period; అయితే పూర్తిస్థాయి నిర్ధారణ కోసం వీరి రక్త నమూనాలను సేకరించి FSL ల్యాబ్‌కు పంపినట్లు డీసీపీ తెలిపారు&period; సోదాల సమయంలో 2 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.