రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ..

Vasundhara Raje

Advertisements

&NewLine;<p>రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ&period;&period; గెలుపు గుర్రాల కోసం ప్రధాన రాజకీయ పార్టీలు ముమ్మర కసరత్తులు చేస్తున్నాయి&period; ఈ క్రమంలోనే అధికార కాంగ్రెస్‌ పార్టీ శనివారం అభ్యర్థుల తొలి జాబితా ను విడుదల చేయగా&period;&period; అటు బీజేపీ కూడా 83 మందితో రెండో జాబితాను ప్రకటించింది&period;రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంపై గత కొంతకాలంగా సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే&period; ఆ ఊహాగానాలకు తెరదించుతూ నేడు వెల్లడించిన జాబితాలో రాజే పేరును భాజపా ప్రకటించింది&period; తన కంచుకోట ఝల్రాపటన్‌ నుంచే ఆమెను బరిలోకి దించింది&period; ఈ నియోజకవర్గం నుంచి ఆమె ఇప్పటికే 4 సార్లు విజయం సాధించారు&period;ఇక&comma; మేవాఢ్‌ వీరుడు మహారాణా ప్రతాప్‌ సింగ్‌ వారసుడు విశ్వరాజ్‌ సింగ్‌ మేవాఢ్‌ను నాథ్‌ద్వారా నుంచి నిలబెట్టింది&period; ఇటీవలే విశ్వరాజ్‌ భాజపాలో చేరారు&period; అటు ప్రముఖ రాజకీయ నేత భైరాన్‌ సింగ్ షెఖావత్‌ అల్లుడు నర్పత్‌ సింగ్‌ రజ్వీకు కూడా తాజా జాబితాలో చోటు దక్కింది&period; బీజేపీఇప్పటివరకు 124 మంది అభ్యర్థులను ఖరారు చేసింది&period; అటు కాంగ్రెస్‌ కూడా శనివారం 33 మందితో అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది&period; అయితే&comma; ఇందులో పెద్దగా ఎలాంటి మార్పులు చేయలేదు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.

తమిళనాడు సీఎం విజయ్ పాలనపై స్టాలిన్ ఫైర్.

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.