రాహువు-కేతువు… స్వరభానుడేనా

Rahu-Kethu

Advertisements

&NewLine;<p>సూర్య&comma;చంద్ర గ్రహణాల గురించి రుగ్వేదంలో ప్రస్తావన కనిపిస్తుంది&period; రుగ్వేదం ప్రకారం రాక్షసుడైన స్వరభానుడు&period;&period; రాహువు-కేతువులుగా ఎలా మారాడో పూర్తిగా శీదికరించబడింది&period; దేవతలు&comma; రాక్షసులు క్షీరసాగరాన్ని అమృతం కోసం మధనం చేసినప్పుడు హలాహలం&comma; కల్పవృక్షం&comma; కామధేనువు&comma; మహాలక్ష్మీ&comma;చంద్రుడు&comma; ధన్వంతరి&comma; అమృతం ఉద్బవించాయని మనకు తెలుసు&period; రాక్షసుల దృష్ఠి కేవలం అమృతంపైనే వుండటం చేత మిగిలిన వాటి విషయం వారికి పట్టలేదు&period; అయితే రాక్షసులు మాత్రం అమృతం కోసం గట్టిగా పట్టుబట్టారు&period; అప్పుడు శ్రీమహవిష్ణవు ఒక మంచి వుపాయంతో ముందుగా దేవతలకు కొద్దికొద్దగా అమృతం పోసి&comma; మిగిలినది అంతా దానవుకు ఇస్తానని చెప్పటంతో వారు అందుకు ఒప్పుకుని తమవంతుకోసం వేచిచూస్తున్నారు&period; విష్ణువు మోహిని అవతారంలో రాక్షసులకు అమృతం అందకుండా దేవతలకు దాన్ని పంచుతుండగా&period;&period; స్వరభాను దాన్ని పసిగడతాడు&period; దేవతలైన సూర్యుడు&comma; చంద్రుడు మధ్య కూర్చోని అమృతాన్ని తాగడం ప్రారంభిస్తాడు&period; వెంటనే అప్రమత్తమైన సూర్య&comma; చంద్రులు ఈ విషయాన్ని విష్ణుమూర్తికి సంజ్ఞలద్వారా తెలియచేస్తారు&period; వేంటనే శ్రీహరి ఆలశ్యంచేయకుండా తన సుదర్శన చక్రంతో స్వరభానుడి తలను ఖండిస్తాడు&period; అప్పటికే అమృతం తాగడం మొదలుపెట్టిన స్వరభానుడు రాహువు-కేతువుగా మారి&comma; తనకు శత్రవులైన సూర్య-చంద్రులపై పగపడతాడు&period; రాహువు&period;&period; సూర్యుడిని చుట్టముట్టగా&period;&period; అంధకారంగా మారుతుంది&period; అప్పుడు దేవతలు అత్రి మహర్షికి మొరపెట్టుకోగా&period;&period; తన మంత్ర శక్తితో అంధకారాన్ని తొలగించాడు&period; రాహుకేతువులు సూర్య చంద్రులని కొన్ని నిమిషాలు వారిని అడ్డుకోగలరు అంతేగానీ సూర్య-చంద్రులను ఏమి చేయలేరు&period; గ్రహణ సమయంలో సూర్య చంద్రులనుండి వచ్చే కిరణాలు ఈ రాహువు కేతువుల మీదగా మనకు పడతాయి&period; అవి ఛాయా గ్రహాలు కావున దోషం కలుగుతుంది&period; తినేపదార్దాలు మీద పడితే విషం గా మారతాయి&period; అందుకే ఆటైం లో తినకూడదు అని చెప్తారు&period; జాతకంలో ఈ రాహు కేతు గ్రహములు ఉంటే ఏ దోషం వస్తుందో ఆ దోషం గ్రహణం వల్ల అందరికి వస్తుంది అందుకే గ్రహణం ముందు స్నానం తరువాత స్నానం చేసి&period; ఇల్లు వాకిళ్లు శుభ్రం చేసుకోవడం&comma; దానాలు చెయ్యడం చెయ్యాలి&period; ఇలా ఆచరించటం వల్ల ఛాయాగ్రహాల ప్రభావం మనపై పడకుండా వుంటుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..

పురాతన శివాలయం కూల్చివేతపై వివాదం..