తెలంగాణలో మరో బ్యారేజీలో లీకేజీ కలకలం

Leakage in barrage

Advertisements

&NewLine;<p>తెలంగాణలోని మరో బ్యారేజీలో లీకేజీ కలకలం సృష్టిస్తోంది&period; ఇటీవలే మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడం&comma; బ్యారేజీ గోడలకు బీటలు రావడం తెలిసిందే&period; ఈ ఘటన మరువక ముందే మరో బ్యారేజీలో లీకేజీ ఏర్పడింది&period; బ్యారేజ్ గేట్లు మూసేసినా కింద నుంచి ఊట ఉబికి రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు&period; ఇసుక సంచులతో నీటి ఊటలను ఆపే ప్రయత్నం చేస్తున్నారు&period; విషయం బయటకు రావడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాసులలో ఆందోళన వ్యక్తమవుతోంది&period; కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన అన్నారం సరస్వతి బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం 10&period;87 టీఎంసీలు&period; ప్రస్తుతం ఇందులో 5&period;71 టీఎంసీల నీటిమట్టం ఉంది&period; దీంతో ఒక గేటును ఎత్తి 2&comma;357 టీఎంసీల నీటిని అధికారులు కిందికి విడుదల చేస్తున్నారు&period; మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలో పిల్లర్ నెంబర్ 15 నుంచి 20 వరకు ఇటీవల కుంగిపోయింది&period; బ్యారేజీ గోడలకు పగుళ్లు వచ్చాయని మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి&period; అధికారులు స్పందించి కుంగిన పిల్లర్లను పరిశీలించారు&period; కేంద్ర బృందం కూడా వచ్చి పరిశీలించింది&period; కాగా&comma; లక్ష్మీ బ్యారేజీ నిర్మాణ దశలోనే 20వ నెంబర్ పిల్లర్ వద్ద పగుళ్లు వచ్చాయని అప్పట్లో ప్రచారం జరిగింది&period; తాత్కాలిక మరమ్మతులు చేసి బ్యారేజీని ప్రారంభించారనే ఆరోపణలూ వినిపించాయి&period; తాజాగా పిల్లర్లు కుంగిపోవడంతో బ్యారేజీలోకి నీటి ఎత్తిపోతలను నిలిపేసినట్లు సమాచారం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారీ వర్షాల కారణంగా మధిర సభ రద్దు.

రెండోరోజు తెలంగాణలో నితిన్ నబీన్ పర్యటన.

జనగామ జిల్లా నర్మెట సీఐ, ఎస్‌ఐ షేక్‌ హమీద్ సస్పెండ్.