మంచిర్యాల జిల్లాలో ముగిసిన ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు.

Advertisements

<p>మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు&period; ఆదివాసీల సాంస్కృతిక ప్రదర్శనలు&comma; భారీ ర్యాలీ నిర్వహించి తమ ఐక్యతను చాటిచెప్పారు&period; ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడారు&period; ప్రపంచవ్యాప్తంగా ఆదివాసుల హక్కుల పరిరక్షణ&comma; అభివృద్ధి కోసం 1994లో ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ప్రకటించిందని తెలిపారు&period; దేశంలో ఆదివాసులు తీవ్రమైన దాడులు&comma; భూసమస్యలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు&period; అడవులను ప్రైవేటీకరించే చర్యలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు&period; సాగులో ఉన్న ప్రతి పొడు భూమికి తక్షణమే పట్టాలు మంజూరు చేయాలని&comma; ఆదివాసులపై అటవీ అధికారుల దాడులను పూర్తిగా నిలిపివేయాలని కోరారు&period; నూటికి నూరుపాళ్లు ఆదివాసులు నివసించే నాన్-ఏజెన్సీ గ్రామాలను షెడ్యూల్డ్ జాబితాలోకి చేర్చాలని డిమాండ్ చేశారు&period; ఆదివాసి యువతకు ఉపాధి&comma; ఉద్యోగ అవకాశాల కోసం ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని కోరారు&period; సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఐక్యంగా పోరాటాలను ఉధృతం చేస్తామని సంఘం నాయకులు హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మహబూబ్ నగర్ భూత్పూర్ వద్ద రోడ్డు ప్రమాదం.

అమరావతిని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయడమే లక్ష్యం.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై విద్యార్థుల ఆందోళన.