రికార్డు స్థాయిలో ట్విట్టర్‌

Twitter

Advertisements

&NewLine;<p>రికార్డు స్థాయిలో ఏకంగా 44 బిలియన్ డాలర్లు వెచ్చించి ఏడాది క్రితం కొనుగోలు చేసిన ట్విట్టర్‌ &lpar;ప్రస్తుతం &OpenCurlyQuote;ఎక్స్’&rpar; ద్వారా అదనపు ఆదాయాన్ని పొందాలని అధినేత ఎలాన్ మస్క్ భావిస్తున్నట్టు తెలుస్తోంది&period; ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం&period; ఎక్స్ యాప్‌పై ప్రత్యేకంగా డేటింగ్ ఫీచర్‌ జోడించాలని ఆయన భావిస్తున్నట్టు కంపెనీ అంతర్గతవర్గాలు పేర్కొన్నాయి&period; అయితే ఒకే సైట్‌పై డేటింగ్ ఫీచర్‌ను ఎలా అందుబాటులోకి తీసుకొస్తారనే వివరాలు తెలియరాలేదు&period; ట్విట్టర్‌ వార్షికోత్సవం సందర్భంగా గురువారం నిర్వహించిన వీడియో కాల్‌లో ఎలాన్ మస్క్ తన ప్రణాళికలను వెల్లడించినట్టు పలు రిపోర్టులు పేర్కొన్నాయి&period; 2024 నాటికల్లా ఈ డేటింగ్ ఫీచర్‌ని తీసుకురావొచ్చని తెలుస్తోంది&period; డేటింగ్ ఫీచర్‌తోపాటు &OpenCurlyQuote;ఎక్స్’పై డిజిటల్ బ్యాంకింగ్ ఫీచర్ తీసుకురావాలని మస్క్ భావిస్తున్నట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి&period; &OpenCurlyQuote;ఎక్స్’ను &OpenCurlyQuote;ఎవ్రీథింగ్ యాప్’గా మార్చాలని భావిస్తున్నట్లు గతంలో ఓ సందర్భంలో పేర్కొన్న విషయం తెలిసిందే&period; మరిన్ని కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించడమే ఆయన లక్ష్యంగా ఉంది&period; కాగా ట్విట్టర్‌ ను ఏడాదిక్రితం ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారు&period; అక్టోబర్ 2022‌లో 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు&period; జులైలో &OpenCurlyQuote;ఎక్స్’గా రీబ్రాండ్ చేశారు&period; ఉద్యోగుల తొలగింపు&comma; వినియోగదారుల అకౌంట్ల తొలగింపు&comma; ఆ తర్వాత పునరుద్ధరణ&comma; బ్లూ టిక్‌కి ఫీజు వంటి చర్యలు వార్తల్లో నిలిచాయి&period; తద్వారా ఎక్స్‌కు ప్రకటనదారులు దూరంగా జరిగారు&period; మొత్తంగా ఈ ప్లాట్‌ఫామ్ విలువ సగానికి సగం దిగజారింది&period; ట్విట్టర్‌ బ్రాండ్ తొలగింపు ద్వారా దీని విలువ 20 బిలియన్ డాలర్ల మేర క్షీణించిందని ఫోర్బ్స్ రిపోర్ట్ అంచనా వేసింది&period; డబ్బు చెల్లించి వాడుకోగలిగే కస్టమర్లను మాత్రమే కలిగివుందన్న కారణాన్ని ప్రస్తావించింది&period; కాగా యూజర్లు ఏం కోరుకుంటున్నారో ఆ విషయం అధినేత మస్క్‌కి అర్థంకావడంలేదని కంపెనీకి చెందిన ఒకరు వాపోయారని రిపోర్టులు పేర్కొంటున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..