రాష్ట్రంలో రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. దీంతో జనం వణికిపోతున్నారు. ఉదయం చాలా చోట్ల పొగమంచు కురుస్తోంది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. వారం రోజులుగా సాధారణం కన్నా రెండు నుంచి 3 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతోంది. రాత్రి పూట ఉష్ణోగ్రత తగ్గి, క్రమంగా చలి ప్రభావం పెరుగుతోంది. గత మూడు రోజులుగా సాయంత్రం 6 గంటల నుంచే చలి గాలులు వీస్తున్నాయి. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఈశాన్య దిశ నుంచి తెలంగాణ వైపు చలి గాలులు వీస్తున్నాయి. దీంతో చలి తీవ్రత పెరుగుతందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు పగటి పూట ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఉత్తర జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల కనిష్ఠ ఉష్టోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో 10 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశముందని తెలిపింది వాతావరణ శాఖ.
110
previous post