లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది

Advertisements

<p>లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది&period; సుమారు 13 గంటల పాటు జరిగిన సుదీర్ఘ చర్చ అనంతరం&comma; తీవ్ర గందరగోళం మధ్య తాత్కాలిక స్పీకర్ జగదాంబికా పాల్ నిర్వహించిన మూజువాణి ఓటుతో ఈ తీర్మానాన్ని తిరస్కరించారు&period; స్పీకర్ ఓం బిర్లా పక్షపాతంతో&comma; ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు&period; దీనికి 118 మంది విపక్ష ఎంపీలు మద్దతు తెలిపారు&period; అయితే చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ à°·à°¾&comma; ప్రతిపక్షాల ఆరోపణలను తీవ్రంగా తిప్పికొట్టారు&period; స్పీకర్ స్థానం అత్యంత పవిత్రమైందని&comma; ఆయన నిర్ణయాలను సుప్రీంకోర్టులో సైతం ప్రశ్నించలేమని స్పష్టం చేశారు&period; గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో&comma; నేటి కాంగ్రెస్ మిత్రపక్షాలైన సమాజ్‌వాదీ పార్టీ&comma; కమ్యూనిస్టు పార్టీలే స్పీకర్లపై అవిశ్వాసం పెట్టాయని గుర్తుచేశారు&period; ఆ సమయంలో స్పీకర్లు చైర్‌లోనే కూర్చోగా&comma; ఈసారి ఓం బిర్లా మాత్రం తీర్మానంపై నిర్ణయం వెలువడే వరకు చైర్‌లో కూర్చోకుండా కొత్త పార్లమెంటరీ సంప్రదాయానికి శ్రీకారం చుట్టారని ప్రశంసించారు&period;<&sol;p>&NewLine;<p>మరోవైపు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ఫైర్ అయ్యారు కేంద్ర హోంమంత్రి అమిత్ à°·à°¾&period; పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు రాహుల్ తరచూ విదేశీ పర్యటనలకు వెళ్తారని&comma; బడ్జెట్&comma; మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక చర్చల్లో పాల్గొనడానికి ఎందుకు ఇష్టపడరని ప్రశ్నించారు&period; సమావేశాలు వచ్చినప్పుడల్లా ఆయన విదేశీ పర్యటనలు ప్లాన్ చేసుకుంటారని&period;&period; మరి విదేశాల నుంచి ఇక్కడ మాట్లాడతారా&quest; అంటూ అమిత్‌à°·à°¾ సెటైర్లు వేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.

సీజేపీ తర్వాత పుట్టుకొచ్చిన మరో పార్టీ.

అస్సాం వరదల బీభత్సం.