విజయవాడ ఉగ్రలింకుల కేసులో మరొకరు అరెస్ట్.

Advertisements

<p>విజయవాడ ఉగ్ర లింకుల కేసులో మరొకరు అరెస్టయ్యారు&period; హైదరాబాద్ చంచల్‌గుడాకు చెందిన సయీదా బేగం అనే మహిళను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు&period; అనంతరం ఆమెను టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు&period; సోహైల్ బేగ్&comma; షరీఫ్&comma; డానిష్‌లు తీవ్రవాద సంస్థల వైపు వెళ్ళేలా ప్రోత్సహించడంలో సయీదా బేగం కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు&period; మరోవైపు ఈ ఉగ్ర లింకుల కేసులో నిందితులు ముగ్గురిని విజయవాడలోని CMM కోర్టులో హాజరుపరిచారు పోలీసులు&period; వారికి ఏప్రిల్ 6 వరకు రిమాండ్ విధించారు&period; అనంతరం వారిని విజయవాడలోని జైలుకు తరలించారు&period;<&sol;p>&NewLine;<p>పాకిస్థాన్‌లోని హ్యాండ్లర్లతో సంబంధాలు ఏర్పరచుకొని సోషల్‌ మీడియా ద్వారా ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్న ఈ ముగ్గురిని విజయవాడ టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేసి&period;&period; వివిధ సెక్షన్ల కింద వారిపై కేసులు నమోదు చేశారు&period; ఇన్‌స్టాగ్రామ్&comma; టెలిగ్రామ్‌తోపాటు పలు సామాజిక మాధ్యమాల ద్వారా యువతను ఉగ్రవాదం భావజాలం వైపు ఆకర్షిస్తున్నట్లు గుర్తించారు&period; అలాగే ఉగ్రవాద చేరికలు&comma; జిహాదీ కార్యకలాపాల కోసం అవసరమైన నిధులు వీరికి పాకిస్థాన్ హ్యాండ్లర్లు సమకూరుస్తున్నట్లు నిఘా వర్గాల వద్ద సమాచారం ఉంది&period; ఏపీలోనే కాకుండా&period;&period;దేశంలోని వివిధ ప్రాంతాల్లోని యువకులతో వీరు గ్రూప్‌లను ఏర్పాటు చేసి&period;&period; అందులో ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ&period;&period;ఉగ్రదాడులకు వారిని సన్నద్ధమయ్యేలా పురిగొల్పుతున్నట్లు విచారణలో వెల్లడైంది&period; అరెస్టయిన వీరందరిని లోతుగా విచారిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..