రాయదుర్గం మండలం బొమ్మక్క పల్లి గ్రామ పరిధిలోని 257 సర్వీస్ గల ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వారం గడిచిన విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారని పట్టణంలోని విద్యుత్ శాఖ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపిన రైతులు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వారం గడిచిన ట్రాన్స్ఫర్మర్ మరమ్మతు చేయడంలో నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ అధికారులు కార్యాలయం లేకపోవడంతో ఎస్సీకి ఫోన్ ద్వారా వివరణ కోరగా మండల పరిధిలోని బానే పల్లి, రాయంపల్లి, ఆవులదట్ల, తదితర గ్రామ లో రైల్వే ట్రాక్ కింద విద్యుత్ వైర్లు తొలగించడంతో వాటి మరమ్మత్తు పనులు అధికారులు ఉన్నారని, వెంటనే సంబంధిత అధికారులతో చర్చించి ట్రాన్స్ఫార్మర్ మంజూర ఎలా చర్యలు తీసుకుంటారని ఎస్సీ తెలిపారు అంతకుముందు బొమ్మకుపల్లి గ్రామ పరిధిలోని 20 ఎకరాల్లో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి నీరు లేక మొక్కజొన్న పంట ఎండిపోయిన బిజెపి నాయకులు నాని, వేణుగోపాల్, బాధిత రైతులతో పరిశీలించారు. చేతికందిన పంట విద్యుత్ సరఫరా లేకపోవడంతో పూర్తిస్థాయిలో ఎండి పోతుందని రైతులు తిప్పేస్వామి, బసవేశ్వర ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also..