118
ఏపీలో మహిళలు అత్యంత పేదరికంతో బాధపడుతున్నారని… పేదరికంతో వారు అనుభవిస్తున్న పరిణామాలను చూసి తీవ్ర ఆవేదనకు గురవుతున్నానని టీడీపీ యువనేత నారా లోకేశ్ అన్నారు. మహిళలు బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టబడుతున్న రాష్ట్రాల్లో ఏపీ తొలి స్థానంలో ఉందని చెప్పారు. వ్యభిచారం కారణంగా బాలికలు యుక్త వయసులోనే గర్భవతులు అవుతుండటం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. దీనిపై పోలీసులు దృష్టి సారించడం లేదని… ఎందుకంటే, ప్రతిపక్షాల గొంతు నొక్కే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారని విమర్శించారు. ఈ సోదరీమణులకు తగిన భద్రత, గౌరవప్రదమైన జీవితాలను అందించడంలో సైకో జగన్ బూటకపు సంక్షేమం విఫలమయిందని దుయ్యబట్టారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.