కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. కోడూరు మండల కేంద్రంలోని ఎస్పీ కాలనీలో రహదారి శంకుస్థాపన సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు బండే శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వివాదం చెలరేగింది. ఎమ్మెల్యేపై బండే శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేస్తూ, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తనయుడు, అల్లుడి అండతో నియోజకవర్గంలో ఇసుక, బుసక అక్రమ తవ్వకాలు, మద్యం అధిక ధరలు, మరియు రేషన్ బియ్యం దందా సాగిస్తున్నారని విమర్శించారు. నీ అవినీతి సామ్రాజ్యాన్ని నిరూపిస్తా, బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ ఎమ్మెల్యేకు నేరుగా సవాల్ విసిరారు. ఒకే కూటమిలో ఉండి నేతలు ఇలా బాహాబాహీకి దిగడం స్థానికంగా కలకలం రేపుతోంది.
#ap #tdp #janasena
ఏపీలోని వేలాది మంది రైతులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల సాగు సీజన్ ప్రారంభానికి ముందే రైతులకు ఉచిత విద్యుత్ అందుబాటులోకి రానుంది. కుటుంబ సర్వే నివేదిక రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 46,113 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల ఏర్పాటుకు ప్రభుత్వం అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతి కేంద్రంగా విడుదలైన ఈ ఆదేశాలు రైతాంగంలో హర్షాన్ని నింపుతున్నాయి. ఈ నెలాఖరులోగా అవసరమైన అన్ని అనుమతులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించడం విశేషం. పెండింగ్‌లో ఉన్న 46,113 దరఖాస్తులను క్లియర్ చేయడానికి ప్రభుత్వం సుమారు రూ.250 కోట్ల వ్యయం చేయనుంది. ఈ భారీ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించింది. పెండింగ్ కనెక్షన్ల ప్రక్రియను వేగవంతం చేయడానికి 10,000 కొత్త ట్రాన్స్ఫార్మర్లను కేటాయించాలని నిర్ణయించింది. దీనివల్ల విద్యుత్ సరఫరాలో లో వోల్టేజ్ వంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో మధ్యంతర బెయిల్‌పై విడుదలైన చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికారు. రాజమండ్రి నుంచి ఉండవల్లి చేరుకునే క్రమంలో అడుగడుగునా నీరాజనాలు పలికారు. ముఖ్యంగా విజయవాడలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. రాత్రి 3.30 గంటల సమయంలో ఆయన కాన్వాయ్ రామవరప్పాడు మీదుగా విజయవాడ నగరంలోకి ప్రవేశించింది. అప్పటికే ఎదురుచూస్తున్న అభిమానులు ఆయనను చూడగానే ఒక్కసారిగా కేరింతలు కొడుతూ రోడ్లపైకి వచ్చారు. ‘జై చంద్రబాబు, జై తెలుగుదేశం’ అంటూ నినాదాలతో మారుమోగించారు. విజయవాడ నిర్మలా కాన్వెంట్, బెంజి సర్కిల్ పరిసరాలు జైచంద్రబాబు నినాదాలతో దద్దరిల్లాయి. కనకదుర్గ వారధి, తాడేపల్లి, ఉండవల్లి సెంటర్లలో చంద్రబాబు రాకకోసం జనం గంటల తరబడి ఎదురుచూశారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా తెల్లవారుజామున సైతం విజయవాడ నగర ప్రజలు చంద్రబాబును చూసేందుకు గంటల తరబడి నిరీక్షించారు. తెల్లవారుజామున 4.45 గంటలకు విజయవాడ నగరంలోని బెంజిసర్కిల్‌కు చేరుకున్న చంద్రబాబునాయుడు కాన్వాయ్కి అపూర్వస్వాగతం లభించింది. విజయవాడ నగరానికి చెందిన వేలాదిమంది మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. పెల్లుబుకిన ఆనందంతో మహిళలు హారతులు ఇచ్చారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, గద్దె అనురాధ, నెట్టెం రఘురామ్, నక్కా ఆనంద్ బాబు, దేవినేని ఉమ, తంగిరాల సౌమ్య, ఆచంట సునీత, నాగుల్ మీరా, కేశినేని చిన్ని, ఇతర ముఖ్యనేతలు అధినేతకు ఘనస్వాగతం పలికారు. కాగా మంగళవారం సాయంత్రం 4.15 గంటల సమయంలో రాజమండ్రి నుండి చంద్రబాబు బయలుదేరారు. అభిమానుల తాకిడి ప్రభావంతో ఆయన సుధీర్ఘ నిర్విరామ ప్రయాణం చేయాల్సి వచ్చింది. మధ్యంతర బెయిల్‌కు సంబంధించి కోర్టు నిబంధనలకు లోబడి చంద్రబాబు కారు లోపల నుంచే అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకుసాగారు. బెంజిసర్కిల్ నుంచి కనకదుర్గ వారధివైపు వెళ్లాల్సిన కాన్వాయ్‌ను పోలీసులు బందరురోడ్డు, ఫైర్ స్టేషన్, వినాయకుడి గుడి, ప్రకాశం బ్యారేజి మీదుగా ఉండవల్లి వెళ్లేవిధంగా దారిమళ్లించారు.మధ్యంతర బెయిల్‌కు సంబంధించి కోర్టు నిబంధనలకు లోబడి చంద్రబాబు కారు లోపల నుంచే అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకుసాగారు. బెంజిసర్కిల్ నుంచి కనకదుర్గ వారధివైపు వెళ్లాల్సిన కాన్వాయ్‌ను పోలీసులు బందరురోడ్డు, ఫైర్ స్టేషన్, వినాయకుడి గుడి, ప్రకాశం బ్యారేజి మీదుగా ఉండవల్లి వెళ్లేవిధంగా దారిమళ్లించారు.
ఇవాళ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులతో నాదెండ్ల మనోహర్ ఫోన్ కాల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా స్థాయి సమన్వయ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు. జనసేన-టీడీపీ సమన్వయ సమావేశాలు విజయవంతం అయ్యేందుకు కృషి చేయాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన పార్టీ చేయి కలిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, ఇటీవల ఇరు పార్టీల సమన్వయ కమిటీ తొలిసారిగా భేటీ అయింది. జిల్లా స్థాయిలోనూ సమన్వయ సమావేశాలు జరపాలని కమిటీ భేటీలో నిర్ణయించారు. అదే సమయంలో, రెండు పార్టీలు కలవకూడదన్న ఉద్దేశంతో ప్రత్యర్థి పార్టీ వ్యక్తులు కుట్రలు చేస్తున్నారని, వారి ఉచ్చులో పడొద్దంటూ పార్టీ శ్రేణులను నాదెండ్ల అప్రమత్తం చేశారు. ఇక, పొత్తులోకి బీజేపీ కూడా కలిసి రావాలని కోరుకుంటున్నామని వెల్లడించారు. జనసేన తరఫున ఆయా జిల్లాల పరిధిలోని ఇన్చార్జులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులతో కలిపి 50 మంది వరకు సమన్వయ సమావేశంలో పాల్గొనేలా కార్యాచరణ రూపొందించినట్టు వివరించారు.
ఏపీలో మహిళలు అత్యంత పేదరికంతో బాధపడుతున్నారని… పేదరికంతో వారు అనుభవిస్తున్న పరిణామాలను చూసి తీవ్ర ఆవేదనకు గురవుతున్నానని టీడీపీ యువనేత నారా లోకేశ్ అన్నారు. మహిళలు బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టబడుతున్న రాష్ట్రాల్లో ఏపీ తొలి స్థానంలో ఉందని చెప్పారు. వ్యభిచారం కారణంగా బాలికలు యుక్త వయసులోనే గర్భవతులు అవుతుండటం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. దీనిపై పోలీసులు దృష్టి సారించడం లేదని… ఎందుకంటే, ప్రతిపక్షాల గొంతు నొక్కే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారని విమర్శించారు. ఈ సోదరీమణులకు తగిన భద్రత, గౌరవప్రదమైన జీవితాలను అందించడంలో సైకో జగన్ బూటకపు సంక్షేమం విఫలమయిందని దుయ్యబట్టారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
ముఖ్యమంత్రి పదవిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం స్థానం పట్ల తాను ఏరోజు విముఖత చూపలేదని పవన్ కల్యాణ్ అన్నారు. సీఎం స్థానం పట్ల తాను సుముఖతతోనే ఉన్నట్లు ప్రకటించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవి కంటే ప్రజల శ్రేయస్సే తనకు ముఖ్యం అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. ప్రజల భవిష్యత్ బాగుండాలన్నదే తన లక్ష్యం అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.





Total views : 78968