శరీరంలో ఉన్న కణాలకు ఆక్సిజన్ మరియు పోషకాలు అందించే ప్రక్రియ గుండె పంపింగ్ చర్యపై ఆధారపడి ఉంటుంది. గుండె తన సామర్ధ్యానికి తగిన విధంగా రక్తాన్ని పంపింగ్ చేయలేని స్థితినే హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. హృదయం వైఫల్యం చెందటానికి రక్తపోటు, మధుమేహం, గుండె రక్తనాళాల్లో పూడికలు మరియు సైలెంట్ హార్ట్ ఎటాక్ వ్యాధి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఈ రోగులలో ఆయాసం, నీరసం, నిస్సత్తువ, అలసట, కనీస వ్యాయామం మరియు శారీరక శ్రమ చేయలేకపోవడం, కాళ్లల్లో, పొట్టల్లో వాపు మరియు నీరు చేరటం వంటి లక్షణాలు ఉంటాయని తెలియజేశారు. 4 దేశాలకు చెందిన గుండె వైద్య నిపుణులు, గుండె మరియు ఊపిరితిత్తుల మార్పిడి శస్త్ర చికిత్సా వైద్య నిపుణులు, ఎక్మొ మరియు క్రిటికల్ కేర్ వైద్య నిపుణులు పాల్గొన్నారు. అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశంలో కూడా 60 లక్షల మందికిపైగా రోగులు హార్ట్ ఫెయిల్యూర్ వ్యాధితో బాధపడుతున్నారని. వీరిలో 50 శాతానికి పైగా వ్యాధి నిర్ధారణ ప్రక్రియ ఆలస్యం అవుతుందని వివరించారు. భారతదేశంలో కూడా ప్రతి సంవత్సరం పది లక్షలకు పైగా రోగులు హార్ట్ ఫెయిల్యూర్ వ్యాధికి గురవుతున్నారని వ్యాధి నిర్ధారణ, సత్వర వైద్య చికిత్స మరియు వైద్య పునరావాసం ఈ వ్యాధిలో కీలక అంశాలని డాక్టర్ రమేష్ బాబు తెలియజేశారు. క్వాడ్రాపుల్ థెరపీ, ఎమర్జెన్సీ బైపాస్ శస్త్ర చికిత్స ద్వారా హార్ట్ ఫెయిల్యూర్ రోగుల జీవన ప్రమాణాలను ఒక దశాబ్దం పాటు పొడిగించవచ్చని కొన్ని ప్రత్యేకమైన అత్యాధునికమైన డివైజ్ల ద్వారా మరియు క్లిష్టతరమైన కరొనరి ఇంటర్వెన్షన్ ప్రక్రియల ద్వారా హార్ట్ ఫెయిల్యూర్ రోగులకు ఉపశమనం కలిగించవచ్చు రక్తపోటు, హృదయ స్పందన రేటు మరియు ఈసీజీ పరీక్షలను అందించే అత్యాధునిక వేరబుల్ డివైజెస్ ను ఇటువంటి రోగులు వాడటం అత్యంత ఉపయోగకరమని తెలియజేశారు.
హార్ట్ ఫెయిల్యూర్..
114
previous post