85
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో మున్సిపల్ కార్మికుల సమ్మె 10వరోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్మికులు నల్ల రిబ్బన్లను కళ్లకు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్యదర్శి మాట్లాడుతూ ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల నిరవదిక సమ్మె చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలను పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇప్పటికే మంత్రి బొత్స సత్యనారాయణ మున్సిపల్ కార్మికులతో పలు సార్లు చర్చలు జరిపినప్పటికీ విఫలం కావడంతో మున్సిపల్ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించేంతవరకు సమ్మెను కొనసాగిస్తామని మరిన్ని రోజుల్లో పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కూడా చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.