68
కడప జిల్లా, పులివెందుల నియోజకవర్గ పరిధిలోని లింగాల వద్ద ట్రాక్టర్ బోల్తా పడి 12 మంది విద్యార్థులకు గాయాలు. ఇద్దరు విద్యార్థులకు కాళ్ళు చేతులు విరిగి తీవ్ర గాయాలు కాగా కడప రిమ్స్ కు తరలించారు.విద్యార్థులంతా లింగాల మండల కేంద్రం లోని బిసి హాస్టల్ చెందిన విద్యార్థులుగా గుర్తించారు. వీరంతా ఈరోజు సెలవు కావడంతో లింగాల గ్రామం శివార్లలో ఉన్న కాశీనాయన గుడి ఆరాధనా ఉత్సవాలు జరుగుతుండగా హస్టల్ సిబ్బంది ట్రాక్టర్ లో విద్యార్థులను తీసుకెళ్ళినట్లు సమాచారం. హాస్టల్లో భోజనం చేయకుండా విద్యార్థులందరనీ గుడి దగ్గర పెట్టే బోజనాలకు తీసుకెళ్లి వస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి 20 మందికి గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమం కావడంతో ఆ ఇద్దరినీ కడప రిమ్స్ తరలించారు.