మార్కాపురం మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రకాశం జిల్లా మార్కాపురంలో మున్సిపాలిటీ వద్ద నిర్వహిస్తున్న సమ్మె 9 వ రోజుకు చేరింది. ఈరోజు సమ్మెలో పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ కార్మికులు మున్సిపల్ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఇచ్చిన మాట తప్పారని, ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులను కనీస వేతనం 26,000 ఇవ్వాలని మున్సిపల్ క్యాజువల్ లీవులు ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, రిటైర్డ్ అయిన వారి స్థానాల్లో వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, మున్సిపల్ బదిలీ కార్మికులకు పర్మినెంట్ గా ఇవ్వాలని నాయకులు తెలిపారు.
మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల 9వ రోజు సమ్మె..
102
previous post