55
తెలంగాణలో వచ్చే ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్టోబర్ 2 వరకు రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు తెలంగాణకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. మరోవైపు.. ఇవాళ హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. హిమాయత్ నగర్, చిక్కడపల్లి, నారాయణగూడ, అబిడ్స్, ఎంజే మార్కెట్, ఖైరతాబాద్, పంజాగుట్ట, నాంపల్లి, బషీర్‌బాగ్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. దీంతో గణేష్ నిమజ్జనాన్ని వీక్షించేందుకు వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయిన కూడా నిమజ్జనం కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం అయింది.