73
తెలంగాణలో సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్ర ఎన్నికలు దగ్గరపడటంతో ప్రధాన పార్టీలన్నీ త్వరితగతిన పావులు కదుపుతూ.. రాజకీయ సమీకరణాలలో దూకుడు పెంచాయన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎంఐఎంను అడ్డుపెట్టుకుని ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. మంత్రులు ఓల్డ్‌సిటీకి వెళ్లాలంటే అసదుద్దీన్ అనుమతి తీసుకొని పర్యటించాల్సిన దుస్థితి నెలకొందని విమర్శించారు. మజ్లిస్ పార్టీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో కరెంట్ బిల్లులు సైతం కట్టరన్నారు. ఓల్డ్‌సిటీలో ఎంఐఎం చేస్తున్నది తప్పు అని అధికారులు కూడా చెప్పలేకపోతున్నారని.. అటువంటి దౌర్బాగ్య పరిస్థితుల్లో ప్రభుత్వం ఉండటం హేయనీయమన్నారు.