గత పదేళ్లుగా నన్ను చూస్తూ వస్తున్నారు. నేను మాట ఇచ్చానంటే అది చేసి చూపిస్తా.. అందుకోసం ఎక్కడిదాకా అయినా వెళ్తా. పాలేరు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న నన్ను గెలిపించండి’’ అని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్, పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస రెడ్డి విజ్ఞప్తి చేశారు. నేలకొండపల్లి మండలంలోని ఆచర్ల గూడెం, ఆరెగూడెం, కోనాయిగూడెం, కోరట్ల గూడెం, అమ్మగూడెం, రాజేశ్వరపురం, శంకరగిరి తండా, ముఠాపురం తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాలేరుకి ఆరు గ్యారెంటీల హామీ పోస్టర్ను ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుందని.. అధికార పార్టీ ఎమ్మెల్యేగా నేను గెలిచిన ఏడాదిలోనే పాలేరు నియోజకవర్గానికి ఆరు గ్యారెంటీలను అమలు చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. ఇది పాలేరు నియోజకవర్గ అన్ని వర్గాల ప్రజలకు తన స్పష్టమైన హామీ అని అన్నారు.
మాట ఇస్తున్న తప్పేది లేదు – పొంగులేటి శ్రీనివాస రెడ్డి
72
previous post