131
నారింజ, నిమ్మలోని విత్తనాలు చాలా చేదుగా ఉంటాయి గానీ వీటికి కాలేయ క్యాన్సర్‌ను తగ్గించే శక్తి ఉందని పరిశోధకులు గుర్తించారు. వీటిల్లోని లిమోలిన్ అనే పదార్థం ఇందుకు తోడ్పడుతున్నట్టు తమిళనాడులోని విశ్వవిద్యాలయాల పరిశోధకుల బృందం కనుగొంది. దీన్ని కాలేయ క్యాన్సర్ బారినపడేలా సృష్టించిన ఎలుకలకు ఇచ్చినపుడు అవి జబ్బు నుంచి కోలుకున్నట్టు తేలింది. నిజానికి లిమోలిన్ నేరుగా కణితులపై పనిచేయటం లేదు. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి క్యాన్సర్‌పై పోరాడేలా తీర్చి దిద్దుతోంది. ఇది యాంటీఆక్సిడెంట్ల మోతాదునూ పెంచి, విశృంఖల కణాలను తగ్గిస్తున్నట్టూ బయట పడింది.