106
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో కోడ్ అమలుతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ పట్టుబడిన సొత్తు రూ.500 కోట్లు దాటింది. నిన్న ఒక్క రోజే నిజాంపేట్‌లో 17 కేజీల బంగారం, 75 కేజీల వెండిని పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులు నిర్వహిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు, ఇన్నర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులను పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. డబ్బు, బంగారం వెండి ఆభరణాలు, మద్యం బాటిళ్లు, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే వస్తువులన్నీ పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్నాయి.