వేసవిలో ఎక్కువగా దొరికే పుచ్చకాయలు శరీరానికి చల్లదనాన్నే కాదు చర్మాన్నీ తాజాగా ఉంచుతాయి. చర్మంపె మచ్చలు, ,సన్నని ముడతలు కనిపిస్తోంటే.. పుచ్చకాయ రసంలో కొద్దిగా నిమ్మరసం కలిపి రోజూ రాత్రిళ్లు ముఖానికి రాసుకోవాలి. మర్నాడు కడిగేసుకుంటే సమస్య తగ్గి ముఖం తాజాగా కనిపిస్తుంది. చిన్న పుచ్చకాయ ముక్కని ముఖానికి రాసుకుంటే.. అది చర్మగంథ్రుల్లోకి చొచ్చుకుపోయి మురికిని శుభ్రం చేస్తుంది. పుచ్చకాయ రసంలో కొద్దిగా పుదీనా రసం ఫ్రిజ్‌లో ఉంచి రాసుకున్నా.. చర్మం కాంతిమంతంగా కనిపిస్తుంది. ఎండలో తిరిగి రావడం వల్ల చర్మంపై వేడి ప్రభావం మాత్రమే కాదు, దుమ్మూధూళీ కూడా చేరుతుంది. ఇలాంటప్పుడు ఇంటికొచ్చాక పుచ్చకాయ రసంలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇది టోనర్‌లా పనిచేసి మురికిని తొలగిస్తుంది.
పుచ్చకాయతో హాయి..
123
previous post