అనంతపురం జిల్లా… రాయదుర్గం నియోజకవర్గం… రాష్ట్ర ప్రభుత్వం వైసిపి పార్టీ ప్రచారాన్ని ప్రభుత్వ యంత్రాంగంతో తో నిర్వహించడం పై మండి పడ్డ మంత్రి కాలవ శ్రీనివాసులు. డి హిరేహాల్ మండలంలోని ఓబులాపురం గ్రామంలో మా కొద్దు జగన్ మళ్లీ రావద్దు జగన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. తెదేపా నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని మాజీ మంత్రి కాలవకు బాణాసంచా పేల్చి ఘన స్వాగతం పలికారు. సచివాలయాన్ని సందర్శించి కొత్త పింఛన్ల నిర్లక్ష్యంపై అధికారులతో సమీక్షించారు. సచివాలయం ఎదుట తెదేపా నేతలతో కలిసి మాజీ మంత్రి కాల్వ బయటాయించి మాకొద్దు జగన్ మళ్లీ రావద్దు జగన్ అంటూ నినాదాలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ దాదాపు ప్రజల సొమ్ము 10 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి బుక్లెట్ లు ముద్రించి జగనే మళ్లీ రావాలి అనే కార్యక్రమాన్ని సచివాలయ సిబ్బంది, వాలెంటీర్లు, ఎంపీడీవోలు, కలెక్టర్లను మొదలుకొని, అందర్నీ దీనిలో భాగస్వామ్యం చేయడం పూర్తిగా అధికార దుర్వినియోగం తప్ప మరొకటి లేదని విమర్శించారు. ప్రజల సొమ్ముతో వైసిపి పార్టీ పిచ్చి ప్రచారాం పై టిడిపి పార్టీ, రాష్ట్రంలో అన్ని వర్గాల వాళ్ళు మేధావులు తీవ్రంగా ఖండిస్తున్నారని విమర్శించారు. టిడిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సొంత కార్యక్రమం, పార్టీ కార్యక్రమానికి గానీ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకోలేదని బదులిచ్చారు. జగన్ ఎందుకు రావాలంటూ రాయలసీమ భవిష్యత్తు ఎడారి అవుతున్నందుకా, మద్యం నిషేధం దశలవారీగా అమలు చేస్తామన్న జగన్ రెడ్డి మద్యం రేట్లు పెంచాడనినా, మద్యం విక్రయాలు పెంచాడనినా, మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు చేశాడు. తప్ప నియంత్రణ ఎక్కడ జరిగిందని వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశాడు.
Read Also..