251
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటు చేసుకుంది. ఆర్మూరులో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో రథం నుంచి ఆయన ముందుకు పడ్డారు. ఇదే సమయంలో వాహనంపై నుంచి సురేశ్ రెడ్డి, జీవన్ రెడ్డి నేలపై పడ్డారు. కేటీఆర్ కింద పడకుండా ఆయన గన్ మెన్లు గట్టిగా పట్టుకున్నారు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. జీవన్ రెడ్డి నామినేషన్ సందర్భంగా చేపట్టిన ర్యాలీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓపెన్ టాప్ వాహనంపై వీరు ప్రయాణస్తుండగా వ్యాన్ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడం వలన వాహనంపై ఉన్న రెయిలింగ్ ఊడిపోవడంతో వారంతా అదుపు తప్పి ముందుకు పడిపోయారు. ఈ ఘటనపై కేటీఆర్ స్పందించారు. తన ఆరోగ్యానికి ఏమి ప్రమాదం లేదని చెప్పారు. తరువాతి ర్యాలీకి కేటీఆర్ వెళ్లారు.