94
ఉపయోగపడే భాగాలు వేరు భాగాలు. ఉదర క్రిములను బైటకు కొట్టివేస్తుంది. భేది మందుగానూ, పురిటి నెప్పులను అధికం చేసేందుకు, లేదా గర్భస్రావానికి ఉపయోగపడుతుంది. దీర్ఘకాలిక వ్రణాలు, కుష్టు, శరీరపు మంటలు, పైల్స్, పొత్తి కడుపు నొప్పి, దురదలను తగ్గిస్తుంది. శరీరానికి బలవర్థకము, వీర్యవృద్ధికి దివ్యౌషధము. మలాశయములోని జిగురును హరింపజేస్తుంది. నరాల నొప్పులకు, చర్మ వ్యాధులకు పై పూతలకు ఉపయోగపడుతుంది. ఇది విషపూరితమైనది. అందుచేత ఇది తగు మోతాదులలో వైద్యుని సలహాపై వాడవలసిన ఔషధము.