90
సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు మండలం పాశమైలారం రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భారీగా మంటలు ఎగసి పడ్డాయి. ఈ ఘటనలోనలుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. మంటలను అదుపు చేసేందుకు స్థానికులు ప్రయత్నించారు. ఘటన స్థలానికి 2 ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. అయితే మంటలు ఆర్పుతుండగా స్థానిక ఫైర్ స్టేషన్ లో పనిచేసే ముగ్గురు ఔట్ out source ఉద్యోగులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఎట్టకేలకు మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి.
Read Also..
Read Also..