59
తాము మూడేళ్లు ఆలోచించి ధరణిని తీసుకువచ్చామని, అలాంటి ధరణిని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బంగాళాఖాతంలో వేస్తుందని, ఈ విషయం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీయే చెప్పారని ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. గురువారం అదిలాబాద్‌లో నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుబంధు కావాలా? రాబంధు కావాలా? ఏది కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. రైతుబంధుతో డబ్బులు దుబారా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారని మండిపడ్డారు. కానీ బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చాక రైతుబంధును విడతలవారీగా ఎకరాకు రూ.16 వేలకు పెంచుతామన్నారు.