70
నెల్లూరు జిల్లా విడవలూరు మండలం స్థానిక డిగ్రీ కళాశాల సమీపంలో రోడ్ ప్రమాదం చోటుచేసుకుంది. నలుగురు ప్రయాణికులతో వెళుతున్న ఆటో ను కీజి వీల్స్ తో ఉన్న ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఆటో లో ప్రయనిస్తున్న ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ప్రయాణికులు అన్నారెడ్డిపాలెం చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ప్రయాణికులు మాలకొండ కు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు తెలిపారు. గాయపడిన వారిని 108 ధ్వారా ఆసుపత్రికి స్థానికులు తరలించారు.