స్థిరాస్ల వ్యవహారంలో సివిల్ కోర్టుల పరిధిని మినహాయించి ట్రిబ్బినల్స్ ఆశ్రయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన టైటిల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 27 ఆఫ్ 2023 తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు పలమనేర్ న్యాయవాదులు ఈరోజు నిరసన వ్యక్తం చేశారు పలమనేరు భారసోసియేషన్ అధ్యక్షులు కే లక్ష్మీపతి ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. పలు న్యాయవాదులు మాట్లాడుతూ ఈ నూతన చట్టం ప్రకారం రైతులు నివాస స్థలాలు యజమానులు తీవ్రంగా నష్టపోతారని స్థానికంగా అందుబాటులోని సివిల్ కోర్టు లను ఆశ్రయించే అవకాశాన్ని కోల్పోతారని స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ సందర్భంలోనే సంబంధిత అధికారులు హక్కులను నిర్ణయించే విధంగా ఈ చట్టం ఉందని సెక్షన్ 38 ప్రకారం పూర్తిగా స్థిరాస్తి హక్కులపై సివిల్ కోట్లను ఆశ్రయించుటకు వీలులేదని తెలిపారు. స్థిరాస్తులపై తమ హక్కులను కాపాడుకోవడానికి జిల్లా స్థాయిలో ట్రిబ్బినల్స్ ను ఆశ్రయించాల్సి వస్తుందని దాని తర్వాత రాష్ట్ర స్థాయి ట్రీబ్బినల్సుకు రాష్ట్ర హైకోర్టుకు వెళ్లాల్సి వస్తుందని ఈ చట్టం వలన రైతులు స్థిరాస్తి హక్కుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో కె లక్ష్మీపతి కుప్పరాజు పరమశివప్ప ఎల్ భాస్కర్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు
రిజిస్ట్రేషన్ యాక్ట్ 27 ను వ్యతిరేకిస్తూ న్యాయవాదుల నిరసన
68
previous post