ములుగులో ఎన్నికల అధికారుల చర్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సీతక్కకు సంబంధించిన ఫోటోలు చిన్నదిగా చేసి ఈవీఎంలు, బ్యాలెట్ పేపర్లపై ముద్రించారని ఆరోపిస్తూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఐటీడీఏ పీవో అంకిత్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ములుగు నియోజకవర్గం నుంచి 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే బ్యాలెట్ పత్రాలపై ఎమ్మెల్యే సీతక్క ఫోటోలు చిన్నదిగా ముద్రించారు. ఎన్నికల అధికారులు బీఆర్ఎస్ పార్టీ కనుసనల్లో పనిచేస్తున్నారని, పారదర్శకత పాటించాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ డిమాండ్ చేశారు. సీతక్క ఫొటోలు సరిచేసి మళ్లీ ముద్రిస్తామని రిటర్నింగ్ అధికారి అంకిత్ హామీ ఇవ్వటంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన విరమించారు
‘నా ఫోటో చిన్నదిగా ప్రింట్ చేశారు’..
78
previous post