62
అనంతపురం జిల్లా కణేకల్ సమీపంలోని శ్రీ చిక్కనేశ్వర స్వామి వడియార్ చెరువు వద్ద ప్రధాన వంతెన కూలిపోయింది. గంగలాపురం గ్రామం వైపు నుంచి ధాన్యం లోడుతో వస్తున్న ఓ లారీ వంతెన దాటుతుండగా ఒక్కసారిగా బ్రిడ్జి కూలిపోయింది. దీంతో కణేకల్- గంగలాపురం, రచ్చుమర్రి గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లారీలోని ధాన్యం బస్తాలు నీటిలో పడిపోయాయి. లారీ డ్రైవర్, క్లీనర్ ప్రమాదం నుంచి బయటపడ్డారు.