కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి | Bridge Collapsed
పెద్దపల్లి జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెన కుప్పకూలింది. ముత్తారం మం. ఓడేడు పరిధిలో మానేరు వంతెనపై ఉన్న వంతెన గిర్డర్లు ఈదురుగాలులకు కూలిపోయాయి. రాత్రి వేళ జనసంచారం లేని సమయంలో ఈ ఘటన జరగడంతో ఎవరికీ గాయాలు కాలేదు. 2016లో ప్రారంభమైన ఈ బ్రిడ్జి పనులు ఇంకా నత్తనడకనే సాగుతున్నాయి. పెద్దపల్లి జిల్లా ఓడేడు నుంచి భూపాలపల్లి జిల్లా గర్మిల్లపల్లి మధ్య ఈ వంతెన నిర్మిస్తున్నారు.
Follow us on : Facebook, Instagram, Youtube& Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ కిక్ చేయండి.
- చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్.దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే నెల 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొనే అవకాశమున్నట్లు సమాచారం. 2019లో చివరిసారిగా భారత్‌కు వచ్చిన షీ జిన్‌పింగ్,…
- పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. సముద్ర వేటకు వెళ్లిన బోటు.. ఇసుకదిబ్బను ఢీకొనడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి.. ఈదుకుంటూ ఒడ్డుకు…
- 22ఏపై బీజేపీ దీక్షలు.భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సెక్షన్ 22ఏ కింద లక్షలాది ఎకరాల భూములను ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ధరణి పోర్టల్‌పై నిర్వహించిన…