పట్టపగలే ఓ ఇంట్లో దొంగలు చోరీ చేశారు. ఈ ఘటన కడప జిల్లా వేంపల్లి పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణ పరిధిలోని స్థానిక చైతన్య హైస్కూల్ వీధి సమీపంలో సింగారెడ్డి అమర్నాథ్ రెడ్డి నివాసం ఉంటున్నాడు. ఇవాళ ఆయన తల్లి నాగసుబ్బమ్మ ఇంట్లో ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించిన గుర్తు తెలియని దొంగలు చోరీ చేసినట్లు బాధితుడు తెలిపారు. నాగసుబ్బమ్మను కొట్టి, ఇంట్లో ఉన్న బాత్రూంలో ఆమెను పడేసి, ఆమె మెడలోని గొలుసు, గాజులు దొంగలు లాక్కుపోయినట్లు బాధితుడు పేర్కొన్నారు. దాదాపు 14 తులాలు బంగారు చోరీ అయినట్లు బాధితుడు తెలిపారు.ఈ ఘటనపై వేంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు అమరనాథ్ రెడ్డి తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలం వద్దకు చేరుకొని ఘటనకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. పట్టపగలే చోరీ జరగడంతో చుట్టుపక్కల గృహయజమానులు భయాందోళనకు గురవుతున్నారు.
దొంగల బీభత్సం..పట్టపగలే ఇంట్లో చోరీ
82
previous post