మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం నియోజకవర్గం నుండి రెండు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. రవాణా మంత్రి పదవి చేపట్టి ఖమ్మం రాజకీయాలలో తన దైన ముద్రను వేసారు. ఖమ్మం కు నిధుల వరద పారించారు. తాను చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుంది అంటూ మూడోసారి తన అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. ఇందంతా నాణానికి ఒక వైపు మాత్రమే మరోవైపు ఖమ్మం లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రాజకీయ నిరంకుషత్వానికి బ్రాండ్ అంబాజిడర్ గా మారారు. తొండ ముదిరి ఊసరవెళ్ళి అయినట్టు ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం సోషలిస్ట్ గా కనబడిన పువ్వాడ మంత్రి పదవి చేపట్టగానే జిల్లా లో తన మాటే శాసనంగా ఫ్యూడల్ రూపమెత్తారు. తనకు వ్యతిరేఖంగా ఎవ్వరు ప్రవర్తించినా అక్రమ కేసులు, నిర్భందాలతో ప్రతిపక్షాల గొంతు నొక్కారు. అక్రమ కేసులతో ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేసిన ఘటనలో ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయి. మంత్రి పువ్వాడ అప్పటి అధికార అండతో ప్రతిపక్షాల గొంతునొక్కినా ప్రస్తుత ఎన్నికల్లో అవే గొంతులు ఖమ్మం లో పువ్వాడపై నిరసన గళాన్ని వినిపిస్తున్నాయి.
తుమ్మల రాకతో సీన్ రివర్స్ ….
ప్రతిపక్షాలను ఎన్ని నిర్భందాలకు గురిచేసినా మంత్రి అనుచరులు తమ అవినీతి తో గుట్టలను గుటకాయ స్వాహా చేసినా తాను ఖమ్మంకు చేసిన అభివృద్ధే తనను మరోసారి గెలిపిస్తుందని నిన్న మొన్నటి వరకు అజయ్ ధీమా గానే ఉన్నారు . రాజకీయంగా బీఆర్ఎస్లో గత ఎన్నికల్లో తాను చెక్ పెట్టి పడగొట్టిన తుమ్మల కాంగ్రెస్ పార్టీలొ చేరడం ఖమ్మంలో తన పైనే పోటీకి దిగడంతో సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. తుమ్మల రాజాకీయ చతురత ముందు పువ్వాడ ప్రచారంలోనే తేలిపోతున్నారు. ఖమ్మంలో అంతా తానై ప్రవర్తంచిన మంత్రి పువ్వాడను సొంత పార్టీ నేతలే అదును చూసి హ్యండిచ్చి ఒక్కొక్కరిగా హస్తం గూటికి చేరుతున్నారు. దీంతో తన గెలుపు నల్లేరుపై నడకే అనుకున్న పువ్వాడ క్షేత్ర స్థాయిలో నెల రోజుల వ్యవధిలోనే సీన్ రివర్స్ కావడంతో ప్రచార పర్వంలో ఆపసోపాలు పడుతున్నారు. ప్రత్యర్థి తుమ్మల పై ఏ అవినీతి ఆరోపనలు లేకుండా తెల్ల కాగితంలా ఉండడంతో మంత్రి పువ్వాడ అజయ్‌కు ఏంచెయ్యాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలోనే స్థానికతను తెరమీదకు తెచ్చే ప్రయత్నం చేసినా ఆ అస్త్రం తుమ్మల పై పనిచేయడం లేదు. దీంతో ప్రత్యర్థిని ఎలా విమర్శించాలో తెలియని విపత్కర పరిస్థితి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ది.
తుమ్మల రాజాకీయ పద్మవ్యూహంలో చిక్కుకున్న అజయ్ ….
తనను ఖమ్మం అభ్యర్థిగా ప్రకటించిన అనతి కాలంలోనే తుమ్మల అజయ్ ను అన్నిరకాలుగా ఇబ్బంది పెట్టేందుకు అస్త్ర శస్త్రాలు సిద్దం చేసుకున్నారు. అక్రమ కేసులే ఆయుదంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. అక్రమ కేసులు నిర్భందాలు లేని ప్రశాంతమైన ఖమ్మం కావాలంటే తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఖమ్మంలో గెలుపును ప్రభావితం చేసే కమ్మ సామాజిక వర్గం తుమ్మలకు జై కొడుతుంది. మున్నూరు కాపు సామాజిక వర్గానికి ఎంపీ వద్ది రాజు పట్ల గతంలో పువ్వాడ వైఖరిని ఊటంకిస్తూ కాపు సామాజిక వర్గానికి దగ్గరయ్యే ప్రయత్నంలో తుమ్మల సఫలీకృతం అయ్యారు. ఖమ్మంలో బలంగా ఉన్న టీడీపీ క్యాడర్ తుమ్మల వెంటే ఉండడంతో గత రెండు దఫాలుగా నామామాత్రం మెజారిటీతో బయటపడ్డ పువ్వాడ ఈ సారి ఎన్నికల్లో గట్టెక్కడం కష్టమే అని రాజవిశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పువ్వాడకు పెట్టని కోటగా ఉన్న రఘునాథపాలెం సైతం తుమ్మల రాకతో బీటలు వారాయి. పువ్వాడను ఒక్కొక్కరిగా కార్పోరేటర్లు వీడుతున్నారు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ కు వలసలు పెరుగుతున్నాయి. నియోజకవర్గంలో బలంగా ఉన్న కాంగ్రెస్ క్యాడర్ , మద్దత్తుగా నిలిచిన టీడీపీ శ్రేణులు, పొంగులేటి అనుచరులు, పొత్తుల్లో చేయి కలిపిన సీపీఐ తుమ్మలకు మరింత బలాన్ని చేకూర్చాయి. రోజురోజుకు బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోవడంతో పువ్వాడ డిఫెన్స్‌లో పడ్డారు. తాను ఓడిపోయినా బీఆర్ఎస్ అదికారంలో వస్తుందని ఎమ్మెల్సీ తీసుకుని మంత్రి పదవి చేపట్టి తాను ఓటమికి కారణం అయిన వారి సంగతి చూస్తానని పార్టీ వీడిన నేతలపై తన అనుచరుల వద్ద మంత్రి పువ్వాడ ఆక్రోశాన్ని వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.