తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగింపునకు ఇంకా 4 రోజుల సమయం మాత్రమే మిగిలివుండడంతో అన్ని పార్టీలు ప్రచార కార్యక్రమాల్లో మరింత జోరు పెంచాయి. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ఇవాళ సాయంత్రం ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. నగరంలో ఆయన ప్రయాణించే ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదురవ్వకుండా హైదరాబాద్ నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రధాని మోదీ శనివారం సాయత్రం 5:20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. వై జంక్షన్, పీఎన్‌టీ ఫ్లైఓవర్, బేగంపేట ఫ్లైఓవర్ మీదుగా ప్రధాని రాజ్‌భవన్ చేరుకోనున్నారు. దీంతో ఆ సమయంలో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ఇక 26న ఆదివారం ఉదయం 10:35 – 11:05 మధ్య ప్రధాని రాజ్‌భవన్ నుంచి ఎంఎంటీఎస్, యశోద ఆసుపత్రి, బేగంపేట ఫ్లైఓవర్ మీదుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆ సమయాల్లో కూడా ఆంక్షలు అమల్లో ఉంటాయి. ట్రాఫిక్ దారి మళ్లింపులు, నిలిపివేత ఉంటాయని హైదరాబాద్ పోలీసులు సూచించారు. ప్రధాని షెడ్యూల్‌కు అనుగుణంగా శనివారం సాయంత్రం, ఆదివారం ఉదయం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ జీ.సుధీర్ బాబు వెల్లడించారు. ఈ మేరకు వివరాలు వెల్లడించారు.
నేడు, రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..!
48
previous post