భాజపాకు వేసే ప్రతి ఓటుతో భారాసకు లాభం కలుగుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఓట్ల చీలికతో భారాసకు ప్రయోజనం కల్పించడమే భాజపా ఉద్దేశమని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్వకుర్తిలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో రేవంత్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ సొంతూరు చింతమడకలో గుడి, బడి కట్టింది కాంగ్రెస్ హయాంలోనే. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను కేసీఆర్ మోసం చేశారు. గతంలో ఆయన్ను ఎంపీగా పాలమూరు నుంచి గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని విస్మరించారు. హైదరాబాద్-శ్రీశైలం హైవే వేసింది కాంగ్రెస్. సంగారెడ్డికి అధిక పరిశ్రమలను తెచ్చి ఉపాధి అవకాశాలను కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది. దళితులు ఆత్మగౌరవంతో బతకాలని అసైన్డ్ భూములకు పట్టాలు ఇచ్చాం. భాజపాకు వేసే ప్రతి ఓటూ మురిగిపోయినట్లే. ఈ ఎన్నికల్లో ఓట్లు చీలడానికి వీల్లేదు. భాజపా, భారాసలో ఎవరి పట్ల కనికరం చూపినా నష్టం తప్పదు…అని రేవంత్‌రెడ్డి విమర్శించారు.
భాజపాకు వేసే ప్రతి ఓటు మురిగిపోయినట్లే
46
previous post