అల్లం ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. చలి ప్రభావం వల్ల తలెత్తే సమస్యలను ఇది అదుపులో ఉంచుతుంది. కొందరికి ప్రయాణాలు పడవు. కడుపులో వికారంగా ఉండటం, వాంతులవడం వంటి సమస్యలు వేధిస్తాయి. అలాంటప్పుడు ముందుగా ఓ కప్పు అల్లం టీ తాగి చూడండి. ఉత్సాహం వచ్చేస్తుంది. వికారంలాంటివి బాధించవు. కాస్త ఎక్కువగా తిన్నప్పుడు భుక్తాయాసం బాధ పెడుతుంది. దాన్నుంచి బయట పడాలంటే కప్పు అల్లం టీ తాగితే సరిపోతుంది. తరచూ ఈ టీ తాగడం వల్ల కండరాలూ, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. రోజుకో కప్పు చొప్పున తాగితే శ్వాసకోశ సంబంధ సమస్యలు అదుపులో ఉంటాయి. రక్త ప్రసరణ నియంత్రణలో ఉంటుంది. అల్లంలో ఉండే ఖనిజ లవణాలు గుండెకు మేలు చేస్తాయి. హృదయ కవాటాల్లో రక్త సరఫరా సక్రమంగా ఉండటానికి దోహదపడతాయి. హృద్రోగాలూ దూరంగా ఉంటాయి. నెలసరి సమస్యలూ అదుపులోకి వస్తాయి. టీ తాగడం వల్ల శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు అధికశాతం అందుతాయి. రోగనిరోధక శక్తి పెరిగి, ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. దీనిలో ఉండే అరోమా గుణాలు మెదడును ఉత్తేజితం చేస్తాయి.
72
previous post
అందానికి బంగాళాదుంప
next post