9 ఎమినోయాసిడ్లు, ఎ,డి, ఇ. విటమిన్లతో సహా, 11 అత్యవసర పోషకాలు, థయమిన్, నియాసిన్, రైబోఫ్లేవిన్, ఐరన్, పాష్పరస్ ఉంటాయి. గుడ్డులోని పచ్చసొనలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుందని కొందరు గుడ్లను పూర్తిగా మానేస్తుంటారు. కానీ వీటిని మితంగా తింటే ఎలాంటి నష్టమూ ఉండదు. గుడ్లలో పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు దండిగా ఉంటాయి. అందువల్ల వీటిని ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. గుడ్లలో విటమిన్ డి దండిగా ఉంటుంది. శరీరానికి ఎండ తగలకపోవటం, సరైన పోషకాహారం తీసుకోకపోవటం వల్ల ప్రస్తుతం చాలామంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. దీంతో మధుమేహం, ఎముకజబ్బుల వంటి ముప్పులు పొంచి ఉంటున్నాయి. అందువల్ల గుడ్లను ఆహారంలో చేర్చుకోవటం మంచిది. ప్రోటీన్లతో నిండిన గుడ్లలో మనకు అవసరమైన అన్నిరకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. శారీరకశ్రమ అధికంగా చేసినప్పుడు తిరిగి శక్తిని పుంజుకోవటానికి ఇవి ఎంతగానో ఉపయోగ పడతాయి. మన శరీరం అవసరమైనంత మేరకు కోలిన్‌ను తయారుచేసుకోలేదు. ఇది లోపిస్తే కాలేయజబ్బు, ధమనులు గట్టిపడటం, నాడీ సమస్యల వంటి వాటికి దారితీస్తుంది. కాబట్టి కోలీన్ అధికంగా ఉండే గుడ్లను తీసుకోవటం మేలు. ముఖ్యంగా గర్భిణులకు ఇదెంతో అవసరం. ఉదయంపూట అల్పాహారంగా గుడ్లను తీసుకుంటే చాలాసేపు కడుపు నిండిన భావన కలిగిస్తాయి. ఆకలి వేయకుండా చూస్తూ ఇలా బరువు తగ్గటానికీ గుడ్లు తోడ్పడతాయన్నమాట. ఉదయాన్నే అల్పాహారంగా పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే ఉప్మాలు, బ్రెడ్ల వంటి అల్పాహారాలకు బదులు గుడ్లను తింటే రక్తంలో మంచి కొవ్వు అయిన హెచ్‌డీఎల్ స్థాయులు మెరుగుపడతాయి. ట్రైగ్లిజరైడ్ల మోతాదులు తగ్గటానికీ దోహదం చేస్తాయి.
Read Also..
Read Also..