ఉత్తరాఖండ్ లోని ఉత్తర్ కాశీలోని సిల్ క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను కాపాడేందుకు చేపట్టిన సహాయక చర్యలకు మరోసారి అవాంతరం ఏర్పడింది. డ్రిల్లింగ్ చేస్తున్న ఆగర్ మెషిన్ కు శుక్రవారం రాత్రి శిధిలాల్లోని ఇనుపపట్టీ ఆడ్డుపడింది. దీంతో ఆగర్ యంత్రం బ్లేడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి వెల్లడించారు. ప్రస్తుతం అది పనికిరాకుండా ప్రత్యామ్నాయ మార్గంలో మాన్యువల్ డ్రిల్లింగ్ చేపట్టనున్నారు. గత కొద్ది రోజులుగా సొరంగం వద్దే తాత్కాలిక అధికార కార్యాలయాన్ని ఏర్పాటుచేసుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న సీఎం పుష్కర్ సింగ్ ధామి శనివారం సొరంగం లోపలికి వెళ్లి పరిస్థితులను పరిశీలించారు. ఆగర్ మెషిన్ బ్లేడ్లను కట్ చేసేందుకు ప్లాస్మా కట్టర్ ను హైదరాబాద్ నుంచి ప్రత్యేకవిమానంలో తీసుకువస్తున్నామని సీఎం పుష్కర్ సింగ్ వెల్లడించారు.
Read Also..