74
కడప జిల్లా.. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ప్రొద్దుటూరు లోని శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమ్రోగాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. ప్రొద్దుటూరు లోని ప్రసిద్ధ ఆగస్తేశ్వర ఆలయం, పెన్నా నది తీరాన రెండవ కాశీగా పేరుగాంచిన శ్రీ ముక్తి రామలింగేశ్వర స్వామి దేవాలయాలలో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్బంగా తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో శివ సన్నిధిలో బారులు తీరారు. మహిళలు ఎంతో నిష్టతో కార్తీక దీపాలు వెలిగించి స్వామివారికి పూజలు చేశారు. గర్భాలయంలోని శివ లింగానికి ఏకవార రుద్రాభిషేకం, ఉత్సవమూర్తులకు అభిషేకం, రుద్ర హోమం నిర్వహించారు. భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.