దేశంలోని పలు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర సహా పలు చోట్లు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత రెండులుగా కురిసిన అకాల వర్షాలతో గుజరాత్ అతలాకుతలమైంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో పిడుగులు పడి సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ వెల్లడించింది. మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని తెలిపింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. సోమవారం రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్, రెడ్ అలర్ట్ జారీ చేసింది.
దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!
79
previous post