ప్రకృతి వ్యవసాయాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తోందని వైకాపా రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.రైౖతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో విస్తృతంగా. సమర్థవంతంగా ప్రకతి సూత్రాలకు అనుగుణంగా అమలవుతున్న ప్రకతి వ్యవసాయ పంటల పరిశీలనలో భాగంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తల బృందం వచ్చారు. లావోస్ ,పీడీఆర్, భారత్, కెన్యా, జింబాబ్వే, సెనెగల్, బుర్కినా ఫావో, ట్యునీషియా, పెరూ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు, పరిశోధకులు ద్వైవార్షిక విరామం, ప్రతిబింబంలో భాగంగా చిన్నమండెం సమీపంలో ఏపీసీఎన్ఎస్ ప్రాజెక్టు ద్వారా అమలవుతున్న ప్రకతి వ్యవసాయ కార్యక్రమాలను అర్ధం చేసుకోవడానికి సందర్శించారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సిరాడ్, వరల్డ్ ఫిష్,అలయన్స్, బయోడైవర్శిటీ, ఒఈపి, ఇనేరా సంస్థల ప్రతినిధులు ఈ బృందంలో వున్నారు. సేంద్రీయ పంటలను అంతర్జాతీయ బృందంతో కలసి ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి, జెడ్ పి మాజీ వైస్ చైర్మన్ దేవనాధ రెడ్డి లు పరిశీలించారు.ఈ సందర్భంగా అంతర్జాతీయ బృందంతో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ. ప్రకృతి వ్యవసాయం, రసాయన వ్యవసాయాల మధ్య తేడాలను ఆయన వివరించారు. ఈ ప్రాంతంలో పరిశ్రమలు లేవని , వ్యవసాయం పైనే తొంబై ఐదు శాతం మంది జీవిస్తున్నారన్నారు. వర్షాభావ పరిస్థితులవల్ల కరవు పరిస్తితులు నెలకొన్నాయని, భూగర్భ జలాలు అడుగంటి పోయాయని ,ఆరు వందలు, ఏడు వందల అడుగుల లోతు వరకు బోర్లు వేస్తున్నా నీరు పడడం లేదన్నారు. జగన్ ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ కు 80 నుంచి 90 శాతం వరకు సబ్సిడీ అందిస్తోందన్నారు. ప్రకృతి వ్యవసాయం లో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందవచ్చునన్నారు. తక్కువ విస్తీర్ణపు పొలంలో ఎక్కువ పంటలను పండించవచ్చునన్నారు.ఈ పద్ధతుల ద్వారా పండించిన పంటలకు మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగా ఉందన్నారు. రసాయనక పద్ధతులతో సాగుచేసిన పంటల వాడకం వల్ల క్యాన్సర్, కిడ్నీ తదితర ప్రమాదకర జబ్బులు సోకుతున్నాయన్నారు.ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండిన ఆహార ఉత్పత్తులును వినియోగిస్తున్నారన్నారు.జగన్ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళలకు విస్తారంగా రుణాలను అందిస్తోందని, తద్వారా మహిళలు ఆ రుణాలతో వ్యవసాయ పంటలకు పెట్టుబడిగా పెడుతున్నారన్నారు.ఏ టి ఎం మోడల్ ను శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది. జెడ్ పి మాజీ వైస్ చైర్మన్ దేవనాధ రెడ్డి మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయపంటల వాడకం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతోందన్నారు. తమ ప్రాంతంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగవుతున్న పంటలను పరిశీలించడానికి వచ్చిన అంతర్జాతీయ బృందానికి శ్రీకాంత్ రెడ్డి, దేవనాథరెడ్డి లు అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రైతు సాధికారిక సంస్థ అధికారులు చంద్రశేఖర్, టీం లీడర్ ధర్మేంద్ర,జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ రామకృష్ణమ రాజు, అడిషనల్ ప్రాజెజ్ట్ మేనేజర్ యశోదమ్మలతో పాటు ప్రకృతి వ్యవసాయ శాఖాధికారులు పాల్గొన్నారు.
ప్రకృతి వ్యవసాయం జగన్ ప్రభుత్వం ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంది…
51