51 ఒకటో డివిజన్లో జరిగిన గొడవ, అరెస్టులు కేవలం టీ కప్పులో తుఫాన్ లాంటివని తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గ నాయకులు సయ్యద్ ముజీబ్ అన్నారు మంగళ వారం సాయంత్రం బస్టాండ్ రోడ్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సయ్యద్ ముజీబ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను వార్డు వార్డుకు ప్రచారం చేస్తూ పార్టీ బలోపేతం దిశగా కృషి చేస్తున్న తనకు తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ మహమ్మద్ నసీర్ తూర్పు సీటును ఆశిస్తున్నారని చెప్పి అడ్డుకోవడం అవివేకం అని అన్నారు. గత నాలుగు దఫాలుగా గుంటూరు తూర్పు నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ ఓటమి చవిచూస్తుందని అయితే ఈ దఫ్ఫా ఎలాగైనా సరే తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని భారీ మెజార్టీతో విజయం సాధించే దిశగా కృషిచేసి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు బహుమతి ఇవ్వాలని సంకల్పంతో తాము కృషి చేస్తున్నామని అన్నారు. తాము మొదటి నుంచి టీడిపి పార్టీకి వీర విధేయులుగా ఉన్నామని తన తండ్రి గతంలో సీటు ఆశించారని అయితే యువకుడు ఉత్సాహవంతుడు నసీర్ అయితే బాగుంటుందన్న అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి తాము నసీర్ కి ఎన్నికల్లో అండగా నిలబడి కృషి చేసామని అన్నారు. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నిబద్ధతతో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో తాను కృషి చేస్తున్న అనే తప్ప, సీటు ఆశించి చేస్తున్నారు అనడం కరెక్ట్ కాదని అన్నారు. సీటు ఎవరికి ఇవ్వాలో ఇవ్వకూడదో అది అధిష్టానం నిర్ణయిస్తుందని, పార్టీ నిర్ణయానికి శిరసావహించి పార్టీ విజయానికి కృషి చేయడం ప్రతి కార్యకర్త క్రమశిక్షణ సైనికుల వలె పని చేయాల్సిన అవసరం ఆసన్నమైందని ఆయన అన్నారు. నియోజకవర్గంలో డివిజన్లు అన్నిటిలో ఓటర్ల నమోదు కార్యక్రమం తో పాటు ఓటర్ల వెరిఫికేషన్ కార్యక్రమాన్ని కూడా తాను సొంత నిధులతో ఏర్పాటు చేశామని అన్నారు. తాము చేసే ప్రతి కార్యక్రమం నసీర్ కి తెలియజేస్తున్నామని అయితే ఆయన స్పందించకుండా తమపై నిరాధార ఆరోపణలు చేసి తమను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. టిడిపి లో తాను ఒక నాయకుడిగా కాకుండా కార్యకర్తలాగా పనిచేస్తున్నానని అన్నారు. పార్టీ పెద్దల ఆదేశాను ప్రకారమే తాను నియోజకవర్గంలో బాబుతో షురిటీ కార్యక్రమాన్ని చేపట్టానని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో తెలియజేసిన పార్టీ నాయకులు సయ్యద్ ఫిరోజ్, సయ్యద్ షబ్బీర్, లడ్డు సుభాని, మహమ్మద్ కరిముల్లా ఇంకా పార్టీ నేతలు పాల్గొన్నారు
ప్రజాదరణ ఓర్వలేక నసీర్ నిందారోపణలు – సయ్యద్ ముజీబ్
123
previous post