కార్తీకమాసం పరమశివుడు పరమశించే నెల. ఈ కార్తీకమాసంలో మాత్రమే వన సమారాధన నిర్వహిస్తారు. కార్తీక దామోదరునికి పూజలు చేసి ఉసిరి చెట్టు కింద దీపాలు పెట్టి అందరూ ఐక్యంగా ఉండేందుకు, ఆధ్యాత్మిక భావాలు పెంచేందుకు ఈ కార్తీక వన సమారాధన ఏర్పాటు చేస్తారు. ఇందులో భాగంగా కాకినాడ జిల్లా కాజులూరు మండలం గొల్లపాలెంలో జరిగిన వన సమారాధన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. నేడు వన సమారాధనలు కుల సమారాధనలుగా మారిపోయాయి. అదేవిధంగా ఆధ్యాత్మికత కనపడటం లేదు. ఆర్కెస్ట్రాలు, రికార్డింగ్ డాన్స్ లు పెడుతున్నారు. కానీ గొల్లపాలెంలో నిర్వహించిన వన సమారాధన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ప్రత్యేకంగా పరమశివుని లింగాన్ని ఏర్పాటు చేశారు. ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించారు. గ్రామంలో స్వామివారి గ్రామ సేవ నిర్వహించారు. సుమారు మూడు వేల మందికి పైగా కార్తీక వన సమారాధన ఏర్పాటు చేశారు. కార్తీక దామోదరుడు పరవశించాడా, పరమశివుడు ఆశీర్వదించాడా అన్న చందాన ఆ సమయంలో వర్షం కూడా పడలేదు. చల్లని గాలులతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. ఓ పక్క ఆధ్యాత్మిక వాతావరణం. మరోపక్క శివ లీలామృతం. మరో పక్క భక్తుల సందడి. వెరసి కార్తీక వన సమారాధనకు నిజమైన నిర్వచనం ఇచ్చాయి. వీరయ్య చౌదరి నేతృత్వంలో హర హరా.. శివ శివా అంటూ కార్తీక్వన సమారాధనలో పాల్గొన్న భక్తులు శివతాండవంతో ఊగిపోయారు. వన సమారాధన ఇలా ఉండాలి. ఆధ్యాత్మికత అంటే ఇదేవిధంగా నిర్వహించాలి అన్న భావం ప్రతి ఒక్కరిలో కలిగింది.
హర హరా..శివ శివా..!
69
previous post