ఎన్టీఆర్ జిల్లా, మైలవరంనియోజకవర్గం, ఇబ్రహీంపట్నం మండలం. కార్తీకమాసం ఆఖరి రోజు కావడంతో మహిళలు భక్తిశ్రద్దలతో పోలిస్వర్గం కి సాగనంపుతారు. నెలమొత్తం ఎంతగానో ఉపవాసం, నోములు, వ్రతాలు చేసి తమ పసుపు కుంకుమ లు చల్లగా ఉండాలని పరమశివుని ప్రార్థిస్తూ నదిలో పుణ్య స్నానం చేసి దీపాలు వెలిగించి నదిలో వదిలి పూజలు ముగించుకుంటారు. విజయవాడ వన్ టౌన్ కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా కృష్ణా నదిలో స్థానమాచరిస్తున్న భక్తులతో కిటకిటలాడుతున్న కృష్ణమ్మ.
karthika masam
శ్రీశైలంలో కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో ఆలయ పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం,దశ హారతులిచ్చారు కార్తికమాస చివరి సోమవారం సందర్భంగా ఆలయ పుష్కరిణి వద్ద దేవస్థానం ఆధ్వర్యంలో లక్షదీపోత్సవం కన్నులపండువగా జరిగింది. పుష్కరిణి వద్ద ప్రత్యేక వేదికపై శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను ఆశీనులను చేసి అర్చకులు వేదపండితులు దీపోత్సవ సంకల్పాన్ని పఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులకు పుష్కరిణికి శాస్త్రోక్తంగా దశ హరతులిచ్చి భక్తులను దీవించారు దశ హారతులను దర్శించుకునేందుకు పుష్కరిణి వద్ద భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి శ్రీశైల మల్లన్న క్షేత్రం భక్తులతో పోటెత్తింది ఈ లక్షదీపోత్సవంలో శ్రీశైలం ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి ఆలయ ఈవో పెద్దిరాజు అధికారులు భక్తులు,ఆలయ సిబ్బంది కార్తీక దీపాలను వెలిగించారు రేపటి అమావాస్యతో శ్రీశైలంలో కార్తీక మసోత్సవాలు ముగుస్తాయి.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లో కార్తీకమాసం ఆఖరి సోమవారం కావడంతో నరసాపురం వశిష్ట గోదావరి వలందర్ రేవులో తెల్లవారుజాము నుండి వేలాది మంది భక్తులు పుణ్య స్థానాలు ఆచరించి గోదావరి నదిలో కార్తీకదీపాలను వదిలి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి సమీపంలోని శివాలయాలు శివనామ స్మరణతో మార్మోగాయి. శివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీకమాసంలో శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ద్వారా పుణ్యఫలం పొందుకుంటామని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో నరసాపురం పట్టణంలోని కపిల మల్లేశ్వర స్వామి దేవాలయంలో తెల్లవారుజాము నుండి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని లక్షదీపార్చన మరియు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. భక్తుల రాకతో నరసాపురం వశిష్ట గోదావరి తీరం జన సందోహంగా మారింది. ప్రతి ఏటా కార్తీక మాసం సందర్భంగా ఈ వలందర్ రేవులో నిత్యం వేలాది మంది భక్తులు కార్తీకదీపాలను వదిలి పుణ్య స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. వశిష్ట ముని తపస్సు చేసిన ఈ ప్రాంతంలో కార్తీక మాసంలో పూజలు నిర్వహించడం ద్వారా ఆ పరమశివుడి అనుగ్రహం పొందుకుంటామని భక్తుల నమ్మకం భక్తజన సందోహంతో శివనామ స్మరణ మార్మోగింది.
Read Also..
పంచారామ క్షేత్రమైన పాలకొల్లులోని శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. పవిత్ర కార్తీక మాసం నాలుగవ సోమవారం సందర్భంగా వేకువజాము నుంచి వేలాది మంది భక్తులు ఆలయానికి పోటెత్తారు. శివునికి అత్యంత ప్రీతి పాత్రమైన కార్తీకమాసంలో శివ పూజలు చేస్తే మోక్ష మార్గమని భక్తులు విశేషంగా విశ్వసిస్తారు. అలాగే శివుని ముందు దీపం వెలిగించడం పాప విముక్తి, ఆత్మ మోక్షానికి మార్గమని చెబుతుంటారు. ఈనేపథ్యంలో రాష్ట్రంలో పంచారామ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. కార్తీక స్నానం ఆచరించి స్వామివారి దర్శనం కోసం క్యూ కట్టారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు దీపాలు వెలిగించి భక్తిశ్రద్దలతో పూజలు చేస్తున్నారు.
పవిత్ర కార్తీక మాసోత్సవాలు చివరి దశకు, చివరి కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని పట్టణంలోని శైవ క్షేత్రాలు శివ నామస్మరణలతో మారుమోగాయి. గుడివాడ పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో తెల్లవారుజాము నుండే వేలాదిగా భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు దేవాలయాలకు చేరుకోగా, వేద పండితులు స్వామి వారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. పుణ్యస్నానాలు ఆచరించిన మహిళా భక్తులు దేవస్థాన ప్రాంగణంలో స్వామివారికి కార్తీకదీప పూజలు నిర్వహిస్తూ తమ మొక్కులు తీర్చుకున్నారు. స్వామి వారి ఆశీస్సులతో కార్తీక మాసోత్సవ వేడుకలు విజయవంతంగా ముగుస్తున్నాయని దేవదాయ శాఖ అధికారి నటరాజన్ షణ్ముగం అన్నారు.
కార్తీకమాసం పరమశివుడు పరమశించే నెల. ఈ కార్తీకమాసంలో మాత్రమే వన సమారాధన నిర్వహిస్తారు. కార్తీక దామోదరునికి పూజలు చేసి ఉసిరి చెట్టు కింద దీపాలు పెట్టి అందరూ ఐక్యంగా ఉండేందుకు, ఆధ్యాత్మిక భావాలు పెంచేందుకు ఈ కార్తీక వన సమారాధన ఏర్పాటు చేస్తారు. ఇందులో భాగంగా కాకినాడ జిల్లా కాజులూరు మండలం గొల్లపాలెంలో జరిగిన వన సమారాధన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. నేడు వన సమారాధనలు కుల సమారాధనలుగా మారిపోయాయి. అదేవిధంగా ఆధ్యాత్మికత కనపడటం లేదు. ఆర్కెస్ట్రాలు, రికార్డింగ్ డాన్స్ లు పెడుతున్నారు. కానీ గొల్లపాలెంలో నిర్వహించిన వన సమారాధన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ప్రత్యేకంగా పరమశివుని లింగాన్ని ఏర్పాటు చేశారు. ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించారు. గ్రామంలో స్వామివారి గ్రామ సేవ నిర్వహించారు. సుమారు మూడు వేల మందికి పైగా కార్తీక వన సమారాధన ఏర్పాటు చేశారు. కార్తీక దామోదరుడు పరవశించాడా, పరమశివుడు ఆశీర్వదించాడా అన్న చందాన ఆ సమయంలో వర్షం కూడా పడలేదు. చల్లని గాలులతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. ఓ పక్క ఆధ్యాత్మిక వాతావరణం. మరోపక్క శివ లీలామృతం. మరో పక్క భక్తుల సందడి. వెరసి కార్తీక వన సమారాధనకు నిజమైన నిర్వచనం ఇచ్చాయి. వీరయ్య చౌదరి నేతృత్వంలో హర హరా.. శివ శివా అంటూ కార్తీక్వన సమారాధనలో పాల్గొన్న భక్తులు శివతాండవంతో ఊగిపోయారు. వన సమారాధన ఇలా ఉండాలి. ఆధ్యాత్మికత అంటే ఇదేవిధంగా నిర్వహించాలి అన్న భావం ప్రతి ఒక్కరిలో కలిగింది.
కార్తీక మాస పౌర్ణమి సోమవారం పర్వతనాన్ని పురస్కరించుకుని హంసలదీవి గ్రామ సమీపంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న కృష్ణా సాగర సంగమం, సముద్ర తీరం భక్తజన సందోహంగా మారింది. వేలాదిగా భక్తులు తరలిరావడంతో సముద్ర తీరం భక్తులతో తిక్కిరిసింది. సముద్ర తీరానికి సుదీర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి సముద్రునికి నమస్కరించి ప్రత్యేక పుణ్య స్థానాలు ఆచరించి పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతోసముద్రవద్ద భక్తులు కు సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కోడూరు నుంచి సాగర సంగమం వద్దకు వెళ్లే రహదారి పూర్తిగా శిధిల వ్యవస్థ చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన రుక్మిణి సత్యభామసమేత వేణుగోపాలస్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
Read Also..
కుప్పం పాతపేటలోని సోమేశ్వర స్వామి ఆలయంలోని స్వామివారికి, గుడిపల్లి మండలంలోని మల్లప్ప కొండపై వెలసిన శ్రీ మల్లేశ్వర స్వామికి కార్తీక పౌర్ణమి సందర్భంగా సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం అభిషేకం అనంతరం వివిధ పుష్పాలతో ప్రత్యేక అలంకరణతో స్వామివారు భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆంధ్ర తమిళనాడు కర్ణాటక రాష్ట్రం నుండి భక్తులు మరియు మహిళలు తరలివచ్చి ఆలయం వాకిట్లో దీపాలు ఏర్పాటు చేసి తమ మొక్కులు తీర్చుకుని స్వామివారిని దర్శించుకున్నారు.
తిరుపతి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణ కైలాసంగా పిలవబడే శ్రీకాళహస్తి ఆలయంలో కార్తీకమాసం, కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు రాత్రికి ఆలయంలో ఘనంగా చొక్కాని మహోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో ఉదయం నుండి ఆలయంలో చొక్కాని జరుగు ప్రాంగణంలో ఆలయ వేద పండితులు పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించి అనంతరం గణపతి పూజ పుణ్యావచనం చేసి వివిధ పుష్పాలతో వేదమంత్రాల నడుమ హారతులు ఇచ్చి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థానం ఆలయ ఈవో KS రామారావు, ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మరియు అధికారులు పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో కార్తీకమాసం సోమవారం కావడంతో భక్తుల సందడి నెలకుంది. వేకువ జామున నుండే తెలుగు రాష్ట్రాలతోపాటు పొరుగున ఉన్న మహరాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు కాళేశ్వరం చేరుకొని పవిత్ర త్రివేణి సంగమ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, సైకత లింగాలను ఏర్పాటు చేసి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, దీపాలు వదిలారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో స్వామి వారికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. శ్రీ శుభానంద దేవి ఆలయంలో మహిళలు కుంకుమార్చన పూజలు చేశారు. ఉసిరి చెట్టు వద్ద లక్ష ముగ్గు, లక్ష వత్తులు, దీపాలు వెలిగించి, దీప దానం, ప్రదక్షణలు చేస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. తరలివచ్చిన భక్తులకు ఇబ్బందులు కల్గకుండా ఆలయ ఇఓ మహేష్ ఏర్పాట్లు చేపట్టారు.





Total views : 147114