కార్తీకమాసం మొదటి సోమవారం కావడంతో మహానంది క్షేత్రంలో భక్తులు పోటెత్తడంతో క్షేత్రం సందడిగా మారింది. కార్తీక మాస పూజల కోసం భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. కోనేటిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు. భక్తులు కామేశ్వరి సహిత మహానందిశ్వరుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
karthika masam
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం, కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా గన్నవరం లో శ్రీ కాశీ విశాలాక్షి అన్నపూర్ణ సహిత విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం లో పోటెత్తిన భక్తులు, ఈరోజు తెల్లవారుజాము నుంచి భక్తులు ఆ శివుని దర్శించుటకు క్యూ లైన్ లో వేచి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి శ్రద్దలతో కార్తీక సోమవారాన్ని ఆచరిస్తున్నారు. మామిళ్ళపల్లి సాంబశివరావు ప్రధానా అర్చకులు.. శివ కేశవులు కు ఇష్టమైన ప్రీతికరమైన రోజులు కార్తిక మాసాలు రోజులు మొదలవుగానే స్నానాలు ఆచరించటం దేవతలు సైతం స్నానాలు ఆచరిస్తారని పురాణాలలో ఇతిహాసాలలో ఉన్నాయి. సూర్యోదయానికి పూర్వమే స్నానాలు ఆచరించాలని పురాణాల్లో ఉన్నాయి. శివునికి విశేషంగా కార్తీక మాసాలలో రుద్రాభిషేకాలు చేసి ఆ పరమశివుని దర్శకున్నట్లయితే కోటి జన్మల్లో ఉన్న పాపాలైన తొలగిపోతాయని నమ్మకం.. ఒక బిల్వహ పత్రాన్ని గనుక శివునికి సమర్పించినట్లయితే కోటి జన్మల లో ఉన్నటువంటి పాపాలన్నీ తొలగిపోతాయని పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈ కార్తీకమాసం రోజుల్లో సోమవారం రోజు ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకున్నాక స్వామివారి సన్నిధిలో దీపారాధన చేసి ఒక పూట భోజనం చేసినట్లయితే చాలా ఫలితము పుణ్య మోకాలు లభిస్తాయని పురాణాలు వివరిస్తున్నాయి. కృత్తికా నక్షత్రంలో వచ్చినటువంటి పౌర్ణమి రోజున కార్తీక పౌర్ణమి అంటారు. ఆ పౌర్ణమి రోజున జ్వాలాతోరణం 365 ఒత్తులు వెలిగిస్తారు. ఎందుకంటే అందరికీ అన్ని రోజులు అనుగుణంగా ఉండదని ఈ సంవత్సరం అంతా కూడా దీపారాధన చేసినటువంటి ఫలితం రావాలని కార్తీక మాసాల పుణ్య రోజుల్లో 365 ఒత్తులు వెలిగించి పుణ్యాన్ని పొందవచ్చు అని పురాణాత్మకంగా తెలియజేయబడింది. కాబట్టి ఈ కార్తీకమాసానికి అంతట విశిష్టత ఉంది. ఈ కార్యక్రమంలో ఆలయ రాజా పోషకులు కాసర్నేని బాబురావు, కాసర్నేని శ్రీనివాసు భక్తుల సందర్శనార్థం దేవాలయంలో అనేక ఏర్పాట్లు చేశారు.
Read Also..
రాష్ట్రవ్యాప్తంగా కూరగాయ ధరలు రాకెట్ వేగంతో పరుగులు తీస్తుంటే మార్కెట్లో చికెన్ ధరలు అమాంతంగా పడిపోయాయి. కార్తీక మాసం రావడంతో గత కొన్ని రోజులుగా బహిరంగ మార్కెట్లో రూ,250,190, నడిచిన ధర నేడు 110/- రూపాయలకు పడిపోవడంతో కార్తీక మాసం కోడి “మాసం” ధరలు ఇంకా నెల రోజులు ఉండడంతో ధర ఇంకెంత క్షీణిస్తుందోనని కృష్ణాజిల్లాలో అమ్మకం దారులు ఆందోళన చెందుతున్న పరిస్థితి. కృష్ణాజిల్లాలో కార్తీకమాసం ప్రారంభం నుండి చికెన్ ధరల రేట్లు తగ్గిపోయాయి. కోళ్ల పెంపకం దారులకు గిట్టుబాటు ధర లభించక వ్యాపారం కొనసాగించలేక అయోమయంలో పడ్డారు. అమ్మకం దారులు కార్తీక మాసంతో వ్యాపారుల మధ్య పోటీ పెరగడంతో రైతులను తగ్గించి విక్రయిస్తున్నారు. దీంతో జీతాలు కూడా గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదని రైతు పూర్తిగా నష్ట పోతున్నాడని మేము కూడా నష్టాలు చూడాల్సి వస్తుందని రవాణా ఛార్జీలు పెరిగిపోవడం మరోపక్క ప్రభావం చూపుతుందని వ్యాపారస్తులు వాపోతున్నారు.
అనేక శివలింగములు ప్రతిష్ఠించి పుష్పక మెక్కి గౌతమి పశ్చిమ తటక మునకు వచ్చు సరికి పుష్పకము కదలలేదు. ఇందు క్షేత్రవిశేషము కలదని పరిశోధించగా ఒక పుట్ట కనబడెను. దానిని ఛేదించి అందు తపము ఆచరించుచున్న స్త్రీని చూచి, నీవు ఎవరవు అని అడుగగా ఆమె తన వృత్తాంతమును ఈ విధముగా వివరించెను. ఉత్కళ దేశమందు ఓడ్ర పుండ్రకమను పేరుగల నగరములో సోమశర్మ అను ముని ఉండెను. అతని కుమారుడు జయభద్రుడు. నేను అతని భార్యను నా పేరు శ్రమణి. నా రూపమును చూసి ఒక గంధర్వుడు నా పతి స్నానార్ధమై వెళ్ళిన తరువాత నా పతిరూపములో వచ్చి కామలీలయందు ప్రయత్నించుచుండగా నా భర్త వచ్చి తన రూపంలో నున్న గంధర్వుని భస్మము చేసేను. కృతాంజలిగా నున్న నన్ను చూచి నీవు ఛండాల స్త్రీగా అగుమని శపించెను. శాపగ్రస్తురాలలైన నేను మామగారి వద్ద మొర పెట్టుకొనగా, వారు దివ్యదృష్టి జరిగినది తెలుసుకొని గౌతమి నదిలో స్నానమాత్రముచే పాప పరిహారమగును. శివశివయని ఘోర తపము చేయుటవలన త్రేతాయుగములో శ్రీరామచంద్రుని దర్శన భాగ్యముచే నీవు ముక్తిని పొందగలనని చెప్పి వెళ్లిరి. అది మొదలు ఇప్పటివరకు తపము చేయుచుండె నని చెప్పెను. అంతట శ్రీరాముడు ఈశ్వరుని ప్రార్ధించగా ఈశ్వరుడు ప్రత్యక్షమై శ్రీరాముని ఆలింగనము చేసుకొనేను అంతట శ్రీ రాముడు ఈశ్వరా ! ఈ శ్రమణికి ముక్తిని ప్రసాదించమనియు, ముక్తి ఇమ్మని సర్వజనులు నిన్ను చూచిన క్షణకాలములో ముక్తినొందు వరము ప్రసాదించమని ప్రార్థించి, ఒక శివలింగము ప్రతిష్ఠించెను. అందువలన ఈ క్షేత్రము క్షణ ముక్తేశ్వర క్షేత్రముగా వెలుగొందుచున్నది.
కార్తీక మాస పర్వదినాలు ప్రారంభం కావడంతో మొదటి రోజైన మంగళవారం కార్తీక మాసం శోభ సంతరించుకుంది.. అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని కోడూరు, నాగాయలంక, అవనిగడ్డ, ఘంటసాల ,మోపిదేవి, చల్లపల్లి మండలాలలోని వేకు జాము నుంచే అదిక సంఖ్యలోమహిళలు కృష్ణా నదిలో ప్రత్యేక పుణ్య స్థానాలు ఆచరించి నదీ తీరాన ఉన్నటువంటి శివాలయాలలో ప్రత్యేక పూజలు చేసి శివుని దర్శించుకున్నారు.. నాగాయలంక శ్రీ రామ పాదక్షేత్రం పుష్కర ఘాట్లో కార్తీక మాసం మొదటి రోజు సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు పవిత్ర స్నానం ఆచరించి నది ఒడ్డునఉన్న రామలింగేశ్వర స్వామిని అభిషేకించారు. కార్తీకదీపం వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు.





Total views : 147168